News February 19, 2025

దేశంలో ఎన్ని కంపెనీలు ఉన్నాయో తెలుసా..

image

2025, జనవరి 31 నాటికి దేశంలో 28లక్షలకు పైగా కంపెనీలు రిజిస్టర్ అయ్యాయని కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీ తెలిపింది. అందులో 65% అంటే 18.1లక్షల కంపెనీలు యాక్టివ్‌గా ఉన్నాయంది. ఇక 5,216 ఫారిన్ కంపెనీలు నమోదవ్వగా అందులో 63% (3,281) యాక్టివ్‌గా ఉన్నట్టు పేర్కొంది. మొత్తంగా 9,49,934 కంపెనీలు మూతపడ్డాయని వెల్లడించింది. బిజినెస్ సర్వీసెస్‌లో 27%, తయారీలో 20%, ట్రేడింగ్‌లో 13% కంపెనీలు పనిచేస్తున్నాయి.

Similar News

News February 21, 2025

త్వరలో ‘దృశ్యం-3’ షురూ

image

జీతూ జోసెఫ్ డైరెక్షన్‌లో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘దృశ్యం-1, 2’ సినిమాలకు ప్రత్యేక ఫాన్ ఫాలోయింగ్ ఉంది. దాదాపు అన్ని భాషల్లో ఈ చిత్రాలు రీమేక్ అయ్యాయి. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పార్ట్-3 త్వరలోనే పట్టాలెక్కనుందని మోహన్ లాల్ అధికారికంగా ప్రకటించారు. ‘గతం ఎప్పుడూ సైలెంట్‌గా ఉండదు. దృశ్యం-3 పక్కా’ అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. నిర్మాత ఆంటోనీ, డైరెక్టర్‌తో దిగిన ఫొటోను షేర్ చేశారు.

News February 21, 2025

చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ

image

బంగ్లాతో విజయం అనంతరం భారత కెప్టెన్ రోహిత్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. 70శాతానికి పైగా సక్సెస్ రేటుతో 100 విజయాలు దక్కించుకున్న కెప్టెన్‌గా పాంటింగ్ రికార్డును ఆయన సమం చేశారు. అన్ని ఫార్మాట్లూ కలిపి 137మ్యాచులకు కెప్టెన్సీ చేసిన రోహిత్ 33మ్యాచుల్లో మాత్రమే ఓటమిని చూశారు. 3 గేమ్స్ డ్రా అయ్యాయి. ఒకటి రద్దయింది. ఇక 30 ఏళ్లు దాటాక కెప్టెన్సీలో 100 విజయాలు సాధించిన ప్లేయర్ రోహిత్ మాత్రమే.

News February 21, 2025

బిడ్డను కోల్పోయిన తల్లులకు 60రోజుల సెలవు: హిమాచల్

image

ప్రభుత్వోద్యోగం చేసేవారిలో చనిపోయిన బిడ్డకు జన్మనిచ్చిన లేదా పుట్టిన బిడ్డ చనిపోయిన తల్లులకు మాతృత్వ సెలవుల్ని 60 రోజుల పాటు ఇవ్వనున్నట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రకటించింది. ఇప్పటికే ఉన్న మెటర్నిటీ లీవ్ నిబంధనలే ఈ సెలవులకూ వర్తిస్తాయని పేర్కొంది. అటు పీజీ చదువుతున్న ఎంబీబీఎస్ వైద్యులకు పూర్తి జీతాన్ని ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది.

error: Content is protected !!