News March 30, 2025
ఉగాది పచ్చడితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!

షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అధికంగానే ఉంటాయి. చేదు కోసం ఉపయోగించే వేప పువ్వు కడుపులోని నులిపురుగులు తొలగించడంతో పాటు జీర్ణవ్యవస్థను శుద్ధి చేస్తుంది. మామిడికాయ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చింతపండు మలబద్ధకాన్ని నివారిస్తుంది, కారం రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. ఉప్పు వల్ల కండరాలకు సత్తువ వస్తుంది. బెల్లంతో రక్తం శుద్ధి అవడంతో పాటు తక్షణ శక్తి లభిస్తుంది.
Similar News
News April 1, 2025
కొత్త రేషన్ కార్డులు ఎందరికంటే?

TG: రాష్ట్రంలో 5 లక్షల కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 1.26 లక్షల లబ్ధిదారులను ఎంపిక చేయగా 4.32 లక్షల ఆర్జీలపై నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ జారీ ప్రక్రియ ఆలస్యమైనా జాబితాలో పేరుంటే రేషన్ పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించారు. మరోవైపు కొత్త కార్డుల ముద్రణ ఇంకా టెండర్ దశలోనే ఉంది. కాగా నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయనుంది.
News April 1, 2025
మెన్స్ కాంట్రాక్ట్ లిస్ట్ ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా

క్రికెట్ ఆస్ట్రేలియా మెన్స్ కాంట్రాక్ట్ లిస్ట్ను ప్రకటించింది. 23 మందితో కూడిన జాబితాలో సామ్ కొన్స్టస్, మాట్ కునెమన్, వెబ్స్టార్లకు చోటు కల్పించింది.
లిస్టు: బర్ట్లెట్, బొలాండ్, అలెక్స్ కారే, కమిన్స్, ఎల్లిస్, గ్రీన్, హజెల్వుడ్, హెడ్, ఇంగ్లిస్, ఖవాజా, లబుషేన్, లియాన్, మార్ష్, మ్యాక్స్ వెల్, మోరిస్, రిచర్డ్ సన్, షార్ట్, స్మిత్, స్టార్క్, జంపా, సామ్ కొన్స్టస్, మాట్ కునెమన్, వెబ్స్టార్
News April 1, 2025
నేటి నుంచి ఆ ప్రాంతాల్లో లిక్కర్ బ్యాన్

మధ్యప్రదేశ్లోని 19 ఆధ్యాత్మిక నగరాలు, పంచాయతీల్లో నేటి నుంచి సంపూర్ణ మద్య నిషేధం అమల్లోకి వచ్చింది. JANలోనే ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉజ్జయిని, ఓంకారేశ్వర్, మహేశ్వర్, అమర్కంటక్, మాండ్లేశ్వర్, చిత్రకూట్, పన్నా, మాండ్ల, ముల్తాయ్, మాండసోర్, ఓర్ఛా, మైహర్, దతియా నగరాలు సహా పలు
జీపీల్లో మద్యం షాపులు, బార్లు మూతపడనున్నాయి. ఇది చరిత్రాత్మక నిర్ణయమని సీఎం మోహన్ యాదవ్ పేర్కొన్నారు.