News November 25, 2024
1 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ అంటే ఎన్ని లీటర్లో తెలుసా?

అంతర్జాతీయంగా ముడి చమురు (క్రూడ్ ఆయిల్)ను బ్యారెళ్లలో కొలుస్తారు. ఒక బ్యారెల్ ఆయిల్ 158.9 లీటర్లతో సమానం. ముడి చమురును రిఫైనరీల్లో శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్, కిరోసిన్, LPG, లూబ్రికెంట్స్ ఉత్పత్తి చేస్తారు. ప్రస్తుతం ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ రేటు రూ.6వేలు ఉంది. దీని ప్రకారం పెట్రోల్ రేటు రూ.37 వరకు ఉండాలి. కానీ రిఫైన్, రవాణా ఛార్జీలు, పన్నులు, కమీషన్లతో రేటు రూ.110గా ఉంది.
Similar News
News November 24, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కానిస్టేబుల్స్ బదిలీ

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ను సోమవారం జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కే.శ్రీనివాస్ను ఇల్లంతకుంట నుంచి వీర్నపల్లి, బీ.నరేందర్ తంగళ్లపల్లి నుంచి గంభీరావుపేట, పీ.మహిపాల్ వేములవాడ నుంచి ఇల్లంతకుంట, కే.గోపాల్ సిరిసిల్ల నుంచి ముస్తాబాద్, ఎస్.శంకర్ వేములవాడ నుంచి వీర్నపల్లికి బదిలీ అయ్యారు.
News November 24, 2025
అద్దె ఇంట్లో ఏ దిశన పడుకోవాలి?

సొంత ఇల్లు/అద్దె ఇల్లు.. అది ఏదైనా ఆరోగ్యం కోసం తల దక్షిణ దిశకు, పాదాలు ఉత్తర దిశకు పెట్టి నిద్రించడం ఉత్తమమని వాస్తు శాస్త్రం చెబుతోందని వాస్తు నిపుణలు కృష్ణాదిశేషు తెలుపుతున్నారు. ‘ఈ దిశలో నిద్రించడం అయస్కాంత క్షేత్రాలకు అనుకూలంగా ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దక్షిణ దిశలో నిద్రించడం సదా ఆరోగ్యకరమైన అలవాటు. తూర్పు దిశలో తలపెట్టి పడుకోవడం కూడా ఉత్తమమే’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News November 24, 2025
అండర్ వరల్డ్ మాఫియాకు బెదరని ధర్మేంద్ర

బాలీవుడ్ చిత్ర పరిశ్రమ 1980, 90ల్లో అండర్ వరల్డ్ మాఫియా బెదిరింపులను విపరీతంగా ఎదుర్కొంది. భయంతో కొందరు నటులు సినిమాలను నిలిపివేయగా, మరికొందరు వారికి డబ్బులు ఇచ్చేవారు. అయితే <<18377596>>ధర్మేంద్ర<<>> మాత్రం వారికెప్పుడూ తలొగ్గలేదని డైరెక్టర్ సత్యజీత్ పూరి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎవరైనా ఆయనను బెదిరింపులకు గురిచేస్తే పంజాబ్ నుంచి గ్రామస్థులు ట్రక్కుల్లో వస్తారని తిరిగి వార్నింగ్ ఇచ్చేవాడని గుర్తుచేశారు.


