News July 16, 2024
అంబానీ సంపద కరగాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలుసా?

అపర కుబేరుడు ముకేశ్ అంబానీ నికర ఆస్తుల విలువ రూ.10.21 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ‘కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయ్’ అనే సామెత ప్రకారం ఒకవేళ అంబానీ ఫ్యామిలీ రోజుకు రూ.3 కోట్లు ఖర్చు చేసినా, విరాళంగా ఇచ్చినా వారి సంపద మొత్తం 3,40,379 రోజుల్లో కరిగిపోతుంది. అంటే 932 సంవత్సరాల 6 నెలలకు వారి సంపద జీరోకు చేరుకుంటుంది. అనంత్ అంబానీ పెళ్లికి రూ.5 వేల కోట్లు ఖర్చు చేసినట్లు టాక్.
Similar News
News December 13, 2025
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News December 13, 2025
బిగ్బాస్.. సుమన్ శెట్టి ఎలిమినేట్!

బిగ్ బాస్ తెలుగు సీజన్-9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉంది. సీజన్ ఇంకో వారమే మిగిలుంది కాబట్టి హౌస్లో ఉన్న ఏడుగురు సభ్యుల్లో ఇద్దరిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. శనివారం ఎపిసోడ్లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఆదివారం ఎపిసోడ్లో సంజన/భరణి/డెమోన్ పవన్లో ఒకరు ఎలిమినేటయ్యే ఛాన్సులున్నాయని SMలో పోస్టులు వైరలవుతున్నాయి.
News December 13, 2025
బేబీ మసాజ్కు బెస్ట్ ఆయిల్స్ ఇవే..

పిల్లల సంపూర్ణ వికాసానికి తల్లిపాలు ఎంత అవసరమో వారి ఆరోగ్యానికి శరీర మర్దన కూడా అంతే అవసరం. అయితే దీనికోసం ప్లాంట్ ఆయిల్, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, ఆవ నూనె వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. శరీరం మీద ఎటువంటి రాషెస్ దద్దుర్లు ఉన్నా కూడా ఈ ఆయిల్ మసాజ్ వల్ల నివారించొచ్చంటున్నారు. బేబీకి ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు చేతికి ఎలాంటి ఆభరణాలు ఉండకుండా చూసుకోవాలి.


