News March 29, 2024
అభ్యర్థులు ఎంత ఖర్చు చేయొచ్చో తెలుసా? – 1/2

ఎన్నికలు వచ్చాయంటే చాలు అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తారు. ర్యాలీలు, బహిరంగ సభలు, పోస్టర్లు, బ్యానర్లు, యాడ్స్ ఇలా నానా హంగామా ఉంటుంది. మరి ఇంతకీ అభ్యర్థులు అధికారికంగా ఎంత ఖర్చు చేయొచ్చో తెలుసా? లోక్‌సభ ఎన్నికలకు అయితే రూ.95లక్షలు, అసెంబ్లీ పోల్స్‌కు అయితే రూ.40లక్షలు. కొన్ని చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అయితే లోక్‌సభకు రూ.75లక్షలు, అసెంబ్లీకి రూ.28లక్షలుగా లిమిట్ ఉంది.
<<-se>>#Elections2024<<>>
Similar News
News January 30, 2026
చూడి పశువుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మిగిలిన పశువుల కంటే చూడి పశువుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిని బయటకు వదలకుండా కొట్టం దగ్గరే పరిమితమైన వ్యాయామం కల్పించాలి. శుభ్రమైన మేత, తాగునీరు అందించాలి. కొట్టంలో జారుడునేల లేకుండా చూడాలి. ఇతర పశువులతో పోట్లాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుక్కలు వీటి వెంటపడి పరిగెత్తించకుండా చూడాలి. కాలువలలో దించడం, వాలుగా ఉన్న ఎత్తయిన గట్లు ఎక్కించడం, ఎక్కువ దూరం నడిపించడం చేయకూడదు.
News January 30, 2026
ఫిబ్రవరి 6న OTTలోకి ‘రాజాసాబ్’!

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘రాజా సాబ్’ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 6 నుంచి స్ట్రీమింగ్ కానుందని జియో హాట్‌స్టార్ పేర్కొంది. మొత్తం 4 భాషల్లో అందుబాటులోకి రానుందని తెలిపింది. భారీ బడ్జెట్‌తో హారర్ ఫ్యాంటసీగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయింది. తమన్ సంగీతం అందించిన ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.
News January 30, 2026
AI దెబ్బ.. మైక్రోసాఫ్ట్‌కు భారీ నష్టాలు

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు AI కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. OpenAI వంటి వాటితో పోటీ పడలేకపోతుండటంతో ఇన్వెస్టర్లు షేర్ల అమ్మకాలకు మొగ్గుచూపారు. దీంతో ఇంట్రాడేలో ఆ కంపెనీ షేర్లు 12% లాస్ అయింది. మైక్రోసాఫ్ట్‌కు 2020 తర్వాత ఇదే వరస్ట్ డే. ఫలితంగా కంపెనీ సుమారు $400 బిలియన్ల సంపద కోల్పోయింది. స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద నష్టం కాగా గత JANలో Nvidia $593 బిలియన్లు కోల్పోయింది.


