News March 29, 2024
అభ్యర్థులు ఎంత ఖర్చు చేయొచ్చో తెలుసా? – 2/2

2019 ఎన్నికల సమయంలో లోక్‌సభకు లిమిట్ రూ.70లక్షలు, అసెంబ్లీకి రూ.28లక్షలుగా ఉండేది. దేశ తొలి జనరల్ ఎలక్షన్‌లో (1951-52) లోక్‌సభకు రూ.25వేలు లిమిట్ ఉండేది. పలు ఈశాన్య రాష్ట్రాలకు ఇది రూ.10వేలుగా ఉండేది. 1971లో ఈ లిమిట్‌ను రూ.35వేలు చేశారు. ఇక 1980లో ఆ లిమిట్ రూ.లక్షకు, 1998లో రూ.15లక్షలకు, 2004లో రూ.25లక్షలకు, 2014లో రూ.70లక్షలకు పెరిగింది.
<<-se>>#Elections2024<<>>
Similar News
News April 11, 2026
25,487 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. పరీక్షల తేదీలు ప్రకటన

సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో కానిస్టేబుల్ (GD) ఉద్యోగాల పరీక్షల తేదీలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. ఏప్రిల్ 27 నుంచి మే చివరి వరకు దేశంలోని వివిధ సెంటర్లలో <
Share It
News April 11, 2026
రేపటి వరకు వర్షాలు!

ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు ప్రాంతంలో సముద్ర మట్టానికి 0.9కి.మీ. ఎత్తులో కొనసాగుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో రేపు ఉదయం వరకు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. అటు మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే ఆస్కారముందని వివరించింది.
News April 11, 2026
బాలీవుడ్ డైరెక్టర్‌తో రామ్ చరణ్ సినిమా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మళ్లీ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. సంజయ్ లీలా భన్సాలీతో కలిసి భారీ పాన్ ఇండియా సినిమా తీయనున్నట్లు సమాచారం. దాదాపు ₹800 కోట్ల బడ్జెట్‌తో హిస్టారికల్ జంగిల్ అడ్వెంచర్ రూపొందనుందని టాక్. భన్సాలీ తన ‘గంగూబాయి కతియావాడి’ విజయం తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. చరణ్ 2013లో ‘జంజీర్’(తుఫాన్)తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.


