News November 26, 2024
కావ్యా మారన్ సంపద ఎంతో తెలుసా?

SRH సీఈవో కావ్యా మారన్ నెట్ వర్త్ రూ.409 కోట్లు అని ‘జన్ భారత్ టైమ్స్’ తెలిపింది. 1992 ఆగస్టు 6న చెన్నైలో జన్మించిన కావ్య చిన్నవయసులోనే తన తండ్రికి చెందిన వ్యాపారాల్లో అడుగుపెట్టారు. కావ్య తండ్రి, SRH కో-ఓనర్ కళానిధి మారన్ దేశంలోని సంపన్నుల్లో ఒకరు. ఆయన నెట్ వర్త్ రూ.19వేల కోట్లు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కళానిధి మారన్దే. సన్ గ్రూప్కు ఆయనే ఛైర్మన్.
Similar News
News January 20, 2026
NALCOలో 110 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (NALCO)లో 110 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. బీటెక్/బీఈ(మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్) ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. గేట్- 2025 స్కోరు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. వెబ్సైట్: https://mudira.nalcoindia.co.in
News January 20, 2026
ఇతిహాసాలు క్విజ్ – 129

ఈరోజు ప్రశ్న: రావణుడి సోదరి శూర్పణఖ అసలు పేరు ఏమిటి? ఆ పేరుకు అర్థం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News January 20, 2026
‘వ్యవసాయ యాంత్రీకరణ’ పథకంలో రాయితీ ఇలా..

TG: ఈ పథకం కింద యంత్రాల కొనుగోలుకు ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తోంది. లబ్ధిదారుల కేటగిరీని బట్టి దీనిలో వాటా ఉంటుంది. సన్న, చిన్నకారు, మహిళా రైతులు, SC, ST, BC రైతులు యంత్రాన్ని కొనుగోలు చేస్తే ధరలో 50% వారు భరించాలి. మిగిలిన 50 శాతాన్ని ప్రభుత్వం రాయితీగా నేరుగా కంపెనీ ఖాతాలో జమ చేస్తుంది. ఇతర రైతులు యంత్రం ధరలో 60 శాతం వాటాను భరించాల్సి ఉండగా.. 40 శాతాన్ని ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుంది.


