News September 10, 2024
రంజీ ట్రోఫీ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

భారత దేశవాళీ క్రికెట్ అంటే మొదటగా గుర్తొచ్చేది రంజీ ట్రోఫీనే. అలనాటి భారత క్రికెటర్ రంజిత్ సింగ్ పేరు మీదుగా టోర్నీకి రంజీ పేరు పెట్టారు. 1872, సెప్టెంబరు 10న రైతు కుటుంబంలో జన్మించిన రంజిత్ యాషెస్‌లో ఇంగ్లండ్ తరఫున ఆస్ట్రేలియాపై ఆడారు. భారత్‌కు క్రికెట్‌ను పరిచయం చేసింది ఆయనే. రంజిత్ ఆటను చూసి, క్రికెట్‌ను కనిపెట్టిన బ్రిటిషర్లు సైతం ముగ్ధులయ్యేవారని చెబుతారు. నేడు రంజిత్ సింగ్ జయంతి.
Similar News
News December 7, 2025
రెండు మూడేళ్లుగా ఇలా ఆడలేదు: కోహ్లీ

ఇటీవలికాలంలో తాను ఈ తరహాలో ఆడలేదని విరాట్ కోహ్లీ తెలిపారు. ‘ఈ సిరీస్‌లో ఆటతో సంతృప్తిగా ఉన్నాను. నిజాయతీగా చెప్పాలంటే గడిచిన రెండు మూడేళ్లలో ఈ విధంగా ఆడలేదు. 15-16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో కొన్నిసార్లు మన సామర్థ్యంపై అనుమానం కలుగుతుంది. మిడిల్ ఆర్డర్లో ఇలా ఆడితే జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలుసు’ అని కోహ్లీ చెప్పారు. కాగా SAపై కోహ్లీ రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో అదరగొట్టారు.
News December 7, 2025
ఇండిగోకి DGCA షోకాజ్ నోటీసులు

ఇండిగో సర్వీసుల్లో ఏర్పడిన గందరగోళంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థ CEO పీటర్ ఎల్బర్స్, మేనేజర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా సమాధానమివ్వాలని పేర్కొంది. లార్జ్ స్కేల్ క్యాన్సిలేషన్స్, ప్లానింగ్‌లో వైఫల్యం, నిర్లక్ష్యం వంటి అంశాలను నోటీసుల్లో ప్రస్తావించింది. ఈ విషయంలో ఇండిగో సంస్థపై కఠిన చర్యలు ఉంటాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
News December 7, 2025
37 మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగవ్వాలి: చంద్రబాబు

AP: ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ మీటింగ్‌లతో వారి పనితీరు మెరుగుపడిందని సీఎం చంద్రబాబు అన్నారు. మరో 37 మంది ఎమ్మెల్యేల పనితీరు మరింత మెరుగుపడాల్సి ఉందన్నారు. అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రతి ఒక్కరి పనితీరుపైన సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. పదవులు ఆశించకుండా పార్టీ కేడర్‌ను సిద్ధం చేసుకోవాలని నేతలకు మార్గనిర్దేశం చేశారు.


