News September 2, 2025
మీకు కన్నడ వచ్చా: రాష్ట్రపతిని ప్రశ్నించిన సీఎం

కర్ణాటక పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అనూహ్య ప్రశ్న ఎదురైంది. ‘మీకు కన్నడ వచ్చా?’ అని ఆ రాష్ట్ర CM సిద్దరామయ్య అడిగారు. ‘కన్నడ నా మాతృ భాష కాకపోయినా అన్ని భాషలను గౌరవిస్తాను. ప్రతిఒక్కరు తమ భాషను కాపాడుకోవాలి. కన్నడ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తా’ అని ప్రెసిడెంట్ బదులిచ్చారు. కాగా కర్ణాటకలో ఉండేవారు తప్పనిసరిగా కన్నడ నేర్చుకోవాలని ఇటీవల సిద్దరామయ్య చెప్పడం వివాదాస్పదమైంది.
Similar News
News September 2, 2025
ఘోరం.. ఒకే ఊరిలో 1,000 మంది మృతి

ఆఫ్రికా దేశం సూడాన్‌లో ఘోర ప్రకృతి విపత్తు చోటుచేసుకుంది. డార్ఫర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఓ గ్రామంలో 1,000 మందికి పైగా చనిపోయారని సూడాన్ లిబరేషన్ మూమెంట్ వెల్లడించింది. కొంతకాలంగా వర్షాల ధాటికి మర్రా పర్వత ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయని, దాని ప్రభావంతో ఓ గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని పేర్కొంది. అంతర్జాతీయ సమాజం తమకు సాయం చేయాలని వేడుకుంది.
News September 2, 2025
టీచర్లు టెట్ పాస్ అయితేనే..: సుప్రీంకోర్టు

ప్రభుత్వ టీచర్లుగా కొనసాగాలన్నా, ప్రమోషన్లు పొందాలన్నా టెట్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కనీసం ఐదేళ్లు సర్వీసు ఉన్నవారంతా టెట్ పాస్ కావాల్సిందేనని తెలిపింది. ఇందుకోసం రెండేళ్ల గడువు విధించింది. ఆ లోపు అర్హత సాధించని వారు ఉద్యోగాలు కోల్పోవాల్సిందేనని తేల్చి చెప్పింది. కాగా ఉమ్మడి ఏపీలో 2012లో తొలిసారి టెట్ నిర్వహించారు. అంతకుముందు ఉద్యోగంలో చేరిన 30వేల మందిపై ప్రభావం పడనుంది.
News September 2, 2025
‘కాళేశ్వరం’లో అవినీతి ఉందని కవిత CBIకి చెబుతారా?

TG: కాళేశ్వరం ప్రాజెక్టులో హరీశ్ రావు, సంతోశ్ రావు <<17582704>>అవినీతికి<<>> పాల్పడ్డారని కవిత ఆరోపించడం సంచలనంగా మారింది. దీంతో కాంగ్రెస్ ఎప్పటినుంచో చేస్తున్న ఆరోపణలు నిజమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే విషయాన్ని కవిత CBIకి చెబుతారా అని హస్తం శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. హరీశ్ రావు అవినీతికి పాల్పడి ఉంటే ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నారని BRS అభిమానులు కవితను నిలదీస్తున్నారు.