News December 16, 2024
కీర్తి సురేశ్ పెళ్లి చీర స్పెషాలిటీ తెలుసా?

మహానటి కీర్తి సురేశ్ పెళ్లి వేడుకలో ఆమె ధరించిన చీర ప్రత్యేకంగా నిలిచింది. దీని తయారీకి 405 గంటలు పట్టిందని సమాచారం. ఆకుపచ్చ, బంగారు వర్ణంలోని ఈ మడిసర్ చీర ధర ఖర్చు రూ.3 లక్షలకు పైనేనని తెలుస్తోంది. ఈ సారీని డిజైనర్ అనిత డొంగ్రే రూపొందించారు. దీనిపై కీర్తి సురేశ్ రాసిన పద్యాన్ని పొందుపరిచారు. మరోవైపు పెళ్లి కొడుకు దుస్తుల తయారీకి 150 గంటలు పట్టిందట.
Similar News
News January 24, 2026
మున్సిపల్ బరిలో జాగృతి.. సింహం గుర్తుపై పోటీ!

TG: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జాగృతి చీఫ్ కవిత నిర్ణయం తీసుకున్నారు. తమ అభ్యర్థులను సింహం గుర్తుతో బరిలో నిలపనున్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లోనూ ఇదే గుర్తుతో పోటీ చేయనున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్‌కు సమయం పట్టే అవకాశం ఉండటంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB)కు చెందిన సింహం గుర్తుతో పోటీ చేయాలని జాగృతి అగ్ర నాయకత్వ నిర్ణయం తీసుకుంది. AIFBతో దీనిపై చర్చించింది.
News January 24, 2026
MANAGEలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (<
News January 24, 2026
ఢిల్లీ రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ ఒగ్గుడోలు

TG: గణతంత్ర వేడుకల్లో తెలంగాణ సంస్కృతి విశ్వవ్యాప్తం కాబోతోంది. జనవరి 26న ఢిల్లీలోని కర్తవ్యపథ్‌పై తొలిసారి మన ఒగ్గుడోలు కళను ప్రదర్శించనున్నారు. ప్రఖ్యాత కళాకారుడు డాక్టర్ ఒగ్గు రవి నేతృత్వంలోని 30 మంది బృందం ఈ చారిత్రక అవకాశం దక్కించుకుంది. ఢిల్లీలో తీవ్రమైన చలిని సైతం లెక్కచేయకుండా 15 రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధాని సమక్షంలో తెలంగాణ జానపద కళా వైభవాన్ని చాటనున్నారు.


