News April 14, 2025
దేశంలో పేరు లేని రైల్వే స్టేషన్ మీకు తెలుసా?

బర్ధమాన్ జిల్లా(WB)లోని ఓగ్రామంలో ఉన్న రైల్వే స్టేషన్కు ఇప్పటి వరకూ పేరే లేదు. తొలుత రాయ్నగర్ అని ఉండేది. అయితే 2008లో ట్రాక్ని కొద్ది మేర పెంచడంతో సమీపంలోని రైనా అనే గ్రామంలో స్టేషన్ను పునర్నిర్మించారు. దీంతో రైనా పేరుతో రైల్వేస్టేషన్ ఉండాలని గ్రామస్థులు నిరసన చేశారు. రెండు గ్రామాల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో రైల్వేశాఖ ఇప్పటివరకూ స్టేషన్కు పేరే పెట్టలేదు.
Similar News
News April 20, 2025
BIG BREAKING: రేపే మెగా డీఎస్సీ

AP: నిరుద్యోగులకు మంత్రి లోకేశ్ శుభవార్త చెప్పారు. రేపు ఉదయం 10 గంటలకు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. https://cse.ap.gov.in, https://apdsc.apcfss.in వెబ్సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. టీచర్ల నియామకం ద్వారా స్కూళ్ల సాధికారత సాధించడంలో ఇదొక చారిత్రక ముందడుగని పేర్కొన్నారు. అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
News April 20, 2025
పోలీసులపై మాజీ ఎంపీ హర్షకుమార్ ఆగ్రహం

AP: మాజీ ఎంపీ హర్షకుమార్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు గతంలో ఎన్నడూ లేని విధంగా తనతో వ్యవహరించారని ఆరోపించారు. 5గంటలపాటు రాజమహేంద్రవరం అంతటా తిప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి నేపథ్యంలో హర్షకుమార్ రాజమహేంద్రవరంలో శాంతి ర్యాలీ తలపెట్టగా ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు.
News April 20, 2025
రేపు వర్షాలు

AP: ఆదివారం పలు జిల్లాల్లో మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది. తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అటు విజయనగరంలో 10, మన్యం జిల్లాలో 2 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.