News June 7, 2024

MLAగా పవన్ కళ్యాణ్ జీతం ఎంతో తెలుసా?

image

తాను ఎమ్మెల్యేగా పూర్తి జీతం తీసుకుంటానని జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ జీతం ఎంతన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఏపీలోని ఒక్కో ఎమ్మెల్యేకు నెల జీతం రూ.3.35 లక్షలుగా ఉంది. నియోజకవర్గ అలవెన్స్‌లతో పాటు ఇతర అలవెన్సులను అందులోనే కలిపారు. దీంతో పవన్ కూడా ఈ మొత్తాన్నే జీతంగా అందుకుంటారు. ఇక దేశంలోనే తెలంగాణ ఎమ్మెల్యేలు అత్యధిక (రూ.4 లక్షలు)జీతం అందుకుంటున్నారు.

Similar News

News October 28, 2025

‘మొంథా’ తుఫాను UPDATES

image

➤ విశాఖ, కోనసీమ, కాకినాడ తదితర జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం.. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం
➤ తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
➤ విశాఖకు వచ్చే 16రైళ్లు రద్దు
➤ 11 జిల్లాల్లో 6 లక్షల హెక్టార్ల పంటలపై తుఫాను ప్రభావం!
➤ తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి 787మంది గర్భిణులు సమీప ఆస్పత్రులకు తరలింపు
➤ సహాయక చర్యలకు సిద్ధమైన తూర్పు నౌకాదళం.. సరకు రవాణా విమానాలు, హెలికాప్టర్లు రెడీ

News October 28, 2025

టీచర్ల బదిలీలకు భారీగా దరఖాస్తులు

image

TG: 317 జీవో కింద స్థానికత కోల్పోయిన టీచర్ల బదిలీలకు దరఖాస్తుల గడువు ఆదివారంతో ముగిసింది. మొత్తం 6,500 అప్లికేషన్లు వచ్చాయి. వీటిని డీఈవోలు పరిశీలించాక ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి పంపిస్తారు. ఉద్యోగుల స్థానికత, కేటాయింపు ప్రక్రియలో జరిగిన పొరపాట్లు, ఇతర కారణాలపై 3-4 రోజుల్లో స్క్రూటినీ పూర్తికానుంది. వచ్చిన దరఖాస్తుల్లో సగం అప్లికేషన్లు మాత్రమే నిబంధనల ప్రకారం అర్హత సాధించే అవకాశం ఉందని సమాచారం.

News October 28, 2025

అవసరం లేని రూట్లలో బస్సులు నిలిపివేయండి: RTC MD

image

AP: భారీ వర్షాల నేపథ్యంలో అవసరం లేని రూట్లలో బస్సు సర్వీసులను తాత్కాలికంగా నిలివేయాలని అధికారులను RTC MD తిరుమలరావు ఆదేశించారు. ప్రయాణికుల రద్దీ ఉండే మార్గాల్లోనే సర్వీసులను నడపాలని సూచించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రాత్రి హాల్ట్‌లు ఉంచొద్దని, ముంపునకు అవకాశమున్న కాల్వలు, కాజ్ వేలు, కట్టల మీదుగా వెళ్లే రూట్లలో బస్సులు నడపవద్దన్నారు. దూరప్రాంత సర్వీసులనూ రద్దీని బట్టే నడపాలని చెప్పారు.