News January 1, 2025
మీకు తెలుగు అంకెలొచ్చా?
ఆర్టీసీ ఓల్డ్ బస్సుల నంబర్ ప్లేట్లను ఎప్పుడైనా గమనించారా? చాలా వాటికి నంబర్లు తెలుగు అక్షరాల్లో ఉంటాయి. కానీ, చాలా మందికి వాటి అర్థాలు తెలియదు. అలాంటివారికోసం తెలుగు అంకెల పట్టికను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. వీటిని నేర్చుకోవడం వల్ల ఏదో ఒక సమయంలో పనికొస్తాయి. ఈ అంకెలు ముందే తెలిసుంటే కామెంట్ చేయండి.
Similar News
News January 4, 2025
నేటి నుంచి జూ.కాలేజీల్లో మధ్యాహ్న భోజనం
AP: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో నేటి నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు కానుంది. మంత్రి నారా లోకేశ్ విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 475ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే 1.48లక్షల మందికి ఈ పథకంతో లబ్ధి చేకూరనుంది. దాదాపు 400కాలేజీలను సమీపంలోని స్కూళ్లకు, మిగతా వాటిని సెంట్రలైజ్డ్ కిచెన్లకు అటాచ్ చేయగా అక్కడ భోజనం తయారు చేసి కాలేజీలకు పంపనున్నారు.
News January 4, 2025
నాకు ఆ తెలివి ఉంది: రోహిత్
జట్టు నుంచి తప్పుకుంటే రిటైర్మెంట్ తీసుకున్నట్లు కాదని రోహిత్ శర్మ స్పష్టం చేశారు. ఓ మ్యాచ్‌కు దూరమైతే తిరిగి కమ్‌బ్యాక్ ఇవ్వలేనని అర్థం కాదు కదా అన్నారు. ఎవరో ల్యాప్‌టాప్ ముందో, పెన్ పట్టుకొని కూర్చొని తన రిటైర్మెంట్, కెప్టెన్సీ గురించి నిర్ణయించలేరని తెలిపారు. తాను సెన్సిబుల్ వ్యక్తినని, ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన తనకు జీవితంలో ఎప్పుడు ఏం కావాలో నిర్ణయించుకునే తెలివి ఉందని చెప్పారు.
News January 4, 2025
అల్లు అర్జున్‌కు కోర్టు షరతులు
TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు బెయిల్ ఇచ్చిన నాంపల్లి కోర్టు పలు షరతులు విధించింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని, కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు రెండు నెలల పాటు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేసింది. అటు బన్నీకి బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు నాంపల్లి కోర్టులో వాదించారు.