News September 10, 2025

మనం రోజూ వాడే ఈ పదాల అబ్రివేషన్ తెలుసా?

image

*WiFi- వైర్‌లెస్ ఫిడిలిటీ, *ATM- ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్, *RIP – రెస్ట్ ఇన్ పీస్, *AM- యాంటి మెరిడియన్, *PM- పోస్ట్ మెరిడియన్, *QR Code- క్విక్ రెస్పాన్స్ కోడ్, *PIN- పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్, *IQ- ఇంటెలిజెన్స్ కోషెంట్ (తెలివితేటలు), *PDF- పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్, *SIM- సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్, *GPS- గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్.

Similar News

News September 10, 2025

18ఏళ్లకే 7 ప్రపంచ రికార్డులు

image

ఐస్‌లింబో స్కేటింగ్‌లో గిన్నిస్‌రికార్డు సాధించిన మొదటిఅమ్మాయిగా సృష్టిశర్మ చరిత్ర సృష్టించారు. నాగ్పూర్‌కు చెందిన సృష్టి ఇప్పటివరకు 7సార్లు గిన్నిస్‌రికార్డులో చోటు సాధించారు. తాజాగా లింబో‌స్కేటింగ్‌లో 50మీటర్లను 7.46 సెకన్లలో పూర్తి చేసి తన రికార్డును తానే తిరగరాశారు. సేవ్‌ ది గర్ల్‌ చైల్డ్‌ ప్రాజెక్ట్‌ అంబాసిడరైన ఆమె తన రికార్డుల ద్వారా వచ్చిన డబ్బును బాలికల శ్రేయస్సుకు కేటాయిస్తున్నారు.

News September 10, 2025

TG CPGET కౌన్సెలింగ్ షురూ

image

TG CPGET <>కౌన్సెలింగ్<<>> రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఇవాళ్టి నుంచి ఈనెల 15వరకు జరగనుంది. ఎంట్రన్స్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారు ఈనెల 18నుంచి 20వరకు వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్ 20న చేసుకోవచ్చు. 24న సీట్ల కేటాయింపు ఉంటుంది. 27న కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. సెకండ్ ఫేజ్ 29 నుంచి జరుగుతుంది.

News September 10, 2025

PHOTO: మనవడితో చిరంజీవి

image

వరుణ్, లావణ్య దంపతులు మగబిడ్డకు జన్మనివ్వడంపై చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. కొణిదెల కుటుంబంలోకి చిన్నారికి స్వాగతం పలుకుతూ వరుణ్-లావణ్యకు అభినందనలు తెలిపారు. నాగబాబు-పద్మజ.. నానమ్మ-తాతయ్యగా ప్రమోట్ అవ్వడం సంతోషంగా ఉందన్నారు. చిన్నారి ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో చిన్నారితో దిగిన ఫొటోను షేర్ చేశారు. అటు భార్య, కుమారుడితో కలిసి ఉన్న ఫొటోను వరుణ్ పోస్ట్ చేశారు.