News October 29, 2024
ఈ రైళ్లకు తేడా తెలుసా?

నీలి, గోధుమ రంగు ICF బోగీలు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లలో కనిపిస్తాయి. గంటకు గరిష్ఠంగా 70 KM వేగంతో వెళ్లగలవు. ఎయిర్ బ్రేకులు వినియోగిస్తారు. మెయింటనెన్స్ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. రాజధాని, ఇతర సూపర్ ఫాస్ట్ ప్రీమియం ట్రైన్లలో ఎరుపు రంగులోని LHB కోచ్లు కనిపిస్తాయి. యాంటీ టెలిస్కోపిక్ డిజైన్ ఆధారంగా తయారుచేయడం వల్ల యాక్సిడెంట్ అయినప్పుడు బోగీలు ఒకదానిపైకి ఒకటి పడవు. గంటకు 200 KM వేగంతో వెళ్లగలవు.
Similar News
News November 15, 2025
అయ్యప్ప స్వాములకు తప్పక తెలియాల్సిన ప్రాంతం

అయ్యప్ప స్వామితో యుద్ధంలో మహిషి అనే రాక్షసి మొండెం పడిన ప్రదేశాన్ని ‘ఎరుమేలి’ అని అంటారు. దీన్నే ‘కొట్టబడి’ అని పిలుస్తారు. శబరిమల యాత్రలో ఎరుమేలికి చేరుకున్న భక్తులు ‘స్వామి దింతకతోమ్… అయ్యప్ప దింతకతోమ్’ అని ‘పేటత్తుళ్లి’ అనే సాంప్రదాయ నృత్యం చేస్తారు. ఇది మహిషిపై సాధించిన విజయాన్ని గుర్తుచేస్తుంది. ఎరుమేలి అయ్యప్ప భక్తులకు ఓ ముఖ్యమైన ఆరంభ స్థానంగా, పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. <<-se>>#AyyappaMala<<>>
News November 15, 2025
179 పోస్టులకు నోటిఫికేషన్

సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ (<
News November 15, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* విశాఖ CII సదస్సులో WEF సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
* పరకామణి కేసు ఫిర్యాదుదారు సతీశ్ మృతిపై దర్యాప్తు ముమ్మరం.. అనంతపురం చేరుకున్న సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్
* గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ఏపీ అవతరిస్తోందన్న మంత్రి గొట్టిపాటి
* చంద్రబాబుపై నమ్మకం లేక కంపెనీలు పెట్టుబడుల్ని భారీగా తగ్గిస్తున్నాయని YCP విమర్శలు


