News August 26, 2024

కృష్ణుడు-కుచేలుడి స్నేహం తెలుసా?(1/2)

image

స్నేహితుల ప్రస్తావన వస్తే కృష్ణుడు-కుచేలుడి మైత్రి తప్పక ఉంటుంది. బాల్యంలో వీరిద్దరు కలిసి చదువుకున్నారు. అల్ప సంతోషి అయిన కుచేలుడు పెళ్లి చేసుకొని దారిద్ర్యం, బహు సంతానంతో జీవిస్తుంటాడు. ఈ క్రమంలో భార్య సలహాతో కృష్ణుడిని కలిసేందుకు వెళ్తాడు. ద్వారకా వెళ్లిన అతడికి కన్నయ్య ఆత్మీయ స్వాగతం పలుకుతాడు. ఇంటికి వచ్చిన అతడి కాళ్లు కడిగి నెత్తిన చల్లుకొని అతిథి మర్యాద పాటిస్తాడు.

Similar News

News November 8, 2025

భారత్, ఆస్ట్రేలియా మ్యాచుకు అంతరాయం

image

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న ఐదో టీ20 నిలిచిపోయింది. బ్యాడ్ వెదర్, వర్షం వచ్చే అవకాశం ఉండటంతో అంపైర్లు మ్యాచును నిలిపివేశారు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోర్ 4.5 ఓవర్లలో 52-0గా ఉంది. అభిషేక్ 23, గిల్ 29 రన్స్ చేశారు.

News November 8, 2025

కర్ణాటక స్పెషల్ డ్రైవ్… 102 ప్రైవేట్ బస్సులు సీజ్

image

కర్నూలు దగ్గర <<18155705>>బస్సు<<>> ప్రమాదంలో 19 మంది మృతితో కర్ణాటక GOVT PVT ట్రావెల్స్‌పై కఠిన చర్యలకు దిగింది. 12 ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా తనిఖీలు చేస్తోంది. OCT24 నుంచి NOV 5 వరకు 4452 బస్సుల్ని తనిఖీ చేసి 102 బస్సుల్ని సీజ్ చేసింది. 604 కేసులు నమోదు చేసిన అధికారులు ₹1,09,91,284 జరిమానా వసూలు చేశారు. కాగా AP, TGల్లో మాత్రం కొద్దిరోజులు హడావుడి చేసి తరువాత మిన్నకుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

News November 8, 2025

వంటింటి చిట్కాలు

image

* ఉప్పు నిల్వ చేసే డబ్బాలో అడుగున బ్లాటింగ్ పేపర్ వేస్తే.. ఉప్పు తేమగా మారదు.
* అల్లం, వెల్లుల్లి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే.. కాగితంలో చుట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి.
* కొత్త బంగాళదుంపలు ఉడికించేటప్పుడు నాలుగు పుదీనా ఆకులు వేస్తే మట్టి వాసన రాదు.
* కరివేపాకు పొడి చేసేటప్పుడు అందులో వేయించిన నువ్వుల పొడి వేస్తే మరింత రుచిగా ఉంటుంది.