News May 24, 2024

ఎవరెస్ట్ ఎత్తు ఎంతో తెలుసా?

image

ప్రపంచంలోనే ఎత్తైన శిఖరంగా మౌంట్ ఎవరెస్ట్ ఖ్యాతి గాంచింది. ఈ పర్వతం సముద్ర మట్టం నుంచి సుమారు 8848 మీటర్ల ఎత్తులో ఉంది. ఎవరెస్టు శిఖరాన్ని తొలిసారి టెన్జింగ్ నార్గే, సర్ ఎడ్మండ్ హిల్లరీలు అధిరోహించారు. చైనా, నేపాల్ దేశాల సరిహద్దుల్లో ఉన్న ఈ శిఖరాన్ని టిబెట్ భాషలో ‘చోమోలుంగ్మా’, నేపాలీలో ‘సాగర్‌మాత’ అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం సుమారు 800 మంది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తారట.

Similar News

News September 16, 2025

విగ్రహం వ్యవహారం.. భూమనపై కేసు నమోదు

image

AP: వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన <<17725838>>కరుణాకర్<<>> రెడ్డిపై కేసు నమోదైంది. భూమన శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని టీటీడీ డిప్యూటీ ఈవో ఫిర్యాదుతో అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తిరుమలలో విష్ణుమూర్తి విగ్రహానికి అపచారం జరిగిందని భూమన ఆరోపించారు. అయితే అది విష్ణు విగ్రహం కాదని శనీశ్వరుడి విగ్రహం అని <<17730080>>ఏపీ ఫ్యాక్ట్‌చెక్<<>> స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

News September 16, 2025

పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎందుకు పిరికివాళ్లుగా మారారు: KTR

image

TG: పార్టీ మారిన MLAలు ఎన్ని తమాషాలు చేసినా ఉప ఎన్నికలు తప్పవని KTR అన్నారు. వాళ్లు ఎందుకు పిరికివాళ్లుగా మారిపోయారో చెప్పాలన్నారు. ‘రేవంత్ చేతిలో మోసపోవడంలో ప్రజల తప్పు లేదు. కాంగ్రెస్ మోసాన్ని ప్రజలకు వివరించడంలో మేం విఫలమయ్యాం. చేసిన మంచిని, అభివృద్ధిని చెప్పుకోలేకపోయాం. ఆ రోజే కాంగ్రెస్ దొంగ పార్టీ అని వివరిస్తే బాగుండేది. INCకి దమ్ముంటే ఉపఎన్నికకు వెళ్లాలి’ అని పేర్కొన్నారు.

News September 16, 2025

HYD మెట్రోలో సెక్యూరిటీ గార్డులుగా ట్రాన్స్‌జెండర్లు

image

TG: హైదరాబాద్‌లోని మెట్రో రైళ్లలో ట్రాన్స్‌జెండర్లను సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 20 మంది హిజ్రాలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అపాయింట్‌మెంట్ లెటర్స్ అందజేశారు. గార్డుల నియామకాల కోసం 400 మంది దరఖాస్తు చేసుకోగా నైపుణ్యం ఉన్న వారిని ఎంపిక చేసినట్లు వివరించారు. ట్రాన్స్‌జెండర్లు సమాజంలో గౌరవంగా బతకాలనే ఉద్దేశంతోనే ఈ అవకాశం కల్పించినట్లు మంత్రి తెలిపారు.