News September 6, 2025
బాలాపూర్ లడ్డూ చరిత్ర తెలుసా?

HYD బాలాపూర్‌లో 1980లో తొలిసారిగా గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 1994లో మొదటిసారి లడ్డూ వేలం నిర్వహించారు. రూ.450కి స్థానికుడు కొలను మోహన్ రెడ్డి కొనుగోలు చేశారు. లడ్డూను కుటుంబసభ్యులకు ఇవ్వడంతో పాటు వ్యవసాయ క్షేత్రంలో చల్లారు. దీంతో ఆ ఏడాది అన్ని పనుల్లోనూ వారికి మంచి జరిగింది. లడ్డూ పొందడం వల్లే కలిసొచ్చిందని భావించిన ఆ ఫ్యామిలీ.. చాలా సార్లు వేలంలో ఆ లడ్డూను దక్కించుకుంది.
Similar News
News January 29, 2026
నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని CBI తేల్చింది: YCP

AP: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై CBN చేసిన దుష్ప్రచారం బెడిసికొట్టిందని YCP విమర్శించింది. లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని CBI తేల్చినట్లు వివరించింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ తప్పుడు ప్రచారంతో కోట్లాది శ్రీవారి భక్తుల మనోభావాలను CBN దెబ్బతీశారని పేర్కొంది. ‘నిజం బయటపడింది.. మీలో ఏమాత్రం నిజాయతీ ఉన్నా లెంపలేసుకుని భక్తులకు క్షమాపణలు చెప్పు CBN’ అని ట్వీట్ చేసింది.
News January 29, 2026
BREAKING: భారీగా పెరిగిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.11,770 పెరిగి రూ.1,78,850కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.10,800 ఎగబాకి రూ.1,63,950 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News January 29, 2026
మొక్కజొన్న పంటలో ఈ జాగ్రత్తలు తీసుకోండి

మొక్కజొన్న పైరు ఒకవేళ 60 నుంచి 65 రోజుల దశలో ఉంటే పంటకు అవసరం మేర ఎరువులను అందించాలి. ఈ సమయంలో చివరి దఫా నత్రజని ఎరువుగా ఎకరాకు 50 కిలోల యూరియా మరియు 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ పైపాటుగా వేయాలి. పూత దశకు ముందు, పూత దశలో మరియు గింజ పాలు పోసుకునే దశలో పైరుకు నీటి తడులను తప్పనిసరిగా అందించాలి. నేల స్వభావం బట్టి 10-15 రోజుల వ్యవధిలో నీటిని అందించకుంటే పంట దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది.


