News November 2, 2024
చాక్లెట్ల చరిత్ర మీకు తెలుసా?

ప్రస్తుతం ఏ శుభకార్యం జరిగినా అక్కడ చాక్లెట్లు ఉండాల్సిందే. ఈ చాక్లెట్లకు 5 వేల ఏళ్ల చరిత్ర ఉంది. తొలుత అమెరికాలోని కోకో చెట్ల పళ్లలోని రసం తీసి తాగేవారు. 1519లో ఈ రసాన్ని స్పెయిన్ తమ దేశానికి తీసుకువచ్చింది. ఆ తర్వాత యూరప్ ప్రాంతానికి పరిచయమైంది. వందల ఏళ్లపాటు రసంగానే తాగారు. 1819లో తొలిసారిగా స్విట్జర్లాండ్‌లో చాక్లెట్ తయారీ ఫ్యాక్టరీ ప్రారంభించారు. అప్పటి నుంచి అవి బిళ్లల రూపంలోకి మారాయి.
Similar News
News November 7, 2025
ఎందరికో ఆదర్శం అరుణిమా సిన్హా జీవితం

జాతీయ స్థాయి వాలీబాల్ ప్లేయర్‌గా ఎన్నో విజయాలు సాధించిన అరుణిమాను దొంగల రూపంలో విధి వెక్కిరించింది. వారిని అడ్డుకునే క్రమంలో ఆమెను కదులుతున్న రైలులోంచి బయటకు తోసేసారు. ఈ ప్రమాదంలో ఆమె కాలును పూర్తిగా తొలగించారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ జీవితం ముగిసిపోయిందని ఆమె బాధపడలేదు. ఏదో ఒకటి సాధించాలనే తపనతో ఎవరెస్టు అధిరోహించిన ప్రపంచ తొలి మహిళా వికలాంగురాలుగా చరిత్ర సృష్టించారు.
News November 7, 2025
ముందు ‘రూ./-’ వెనక ‘మాత్రమే’ ఎందుకు?

చెక్స్ లేదా చందా బుక్స్ తదితరాలపై అమౌంట్ రాసేటప్పుడు అంకెల ముందు ‘రూ.’ అని పెడతాం (Ex: రూ.116/-). ఇక అక్షరాల్లో రాస్తే చివర్లో ‘మాత్రమే’ (Ex: వంద రూపాయలు మాత్రమే) పేర్కొంటాం. ట్యాంపర్ ప్రూఫ్ సెక్యూరిటీ రీజన్‌తో ఈ పద్ధతి మొదలైంది. ఇప్పుడంటే కంప్యూటర్ యుగం కానీ ఒకప్పుడు చేతి రాతలతో మాన్యువల్‌గా పనులు జరిగేవి. దీంతో అమౌంట్ ముందు లేదా వెనక ఏ నంబర్/పదం యాడ్ చేయలేకుండా బ్యాంకులు ఈ పద్ధతి మొదలుపెట్టాయి.
News November 7, 2025
USలో అనుమానిత పౌడర్‌తో సైనికుల అస్వస్థత

అమెరికాలోని మేరీల్యాండ్ ఎయిర్‌బేస్‌లో కెమికల్ పౌడర్‌తో సైనికులు అస్వస్థతకు గురయ్యారు. బేస్‌కు గురువారం వచ్చిన పార్శిల్‌ను సిబ్బందిలో ఒకరు ఓపెన్ చేయగా పౌడర్ బయటపడింది. ఆ గాలి పీల్చిన వారు స్పృహ కోల్పోగా అప్రమత్తమైన సమీప సిబ్బంది వారిని ఆస్పత్రులకు తరలించారు. బ్లాక్‌ను సీల్ చేసి, సమీప భవనాల్లో స్టాఫ్‌ను ఖాళీ చేయించారు. ఆ పౌడర్ ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమై దర్యాప్తు జరుగుతోంది.


