News October 30, 2024
ఈ పదాలకు అర్థం తెలుసా?

హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మార్కాపురం, అనంతపురం.. తెలుగురాష్ట్రాల్లో చాలా ప్రాంతాలకు చివర్లో ఇలా బాద్ లేదా పురం అని కనిపిస్తుంటుంది. ఎందుకంటే.. ఆబాద్ అంటే నివాసం లేదా ఆహారం లభించే నివాసయోగ్యమైన స్థలమని అర్థం. వాటిని స్థాపించిన వారు లేదా ప్రముఖుల పేర్లకు చివర ఆబాద్ పేరిట ప్రాంతాలను పిలుస్తున్నాం. ఇక పురం అంటే పట్టణమని అర్థం. ఈ అర్థంలోనే కొన్ని ఊళ్ల చివర పురం అన్న పదాన్ని వాడటం ప్రారంభమైంది.
Similar News
News February 7, 2026
APRకి అమరావతిలో క్వాంటం కంప్యూటర్లు: చంద్రబాబు

AP: ఈ నెల 16న అమరావతికి బిల్ గేట్స్ రానున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘APR 14 నుంచి 2 క్వాంటం కంప్యూటర్లు అమరావతిలో ఆపరేట్ అవుతాయి. అమరావతిలో క్వాంటం టాలెంట్ హబ్ రెడీ అవుతోంది. దాని ద్వారా ఐదేళ్లలో 35లక్షల మంది విద్యార్థులు ట్రైన్ అవుతారు. తిరుపతిని స్పేస్ సిటీగా మార్చేందుకు సహకరించాలని ఇప్పుడే కేంద్రాన్ని కోరాను. వచ్చే 40ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చేపట్టాం’ అని తెలిపారు.
News February 7, 2026
ప్రీ డయాబెటీస్‌ని ఎలా గుర్తించాలంటే?

ప్రీ డయాబెటిస్ అంటే డయాబెటిస్‌కి ముందు స్టేజి. వీరిలో రక్తంలో చక్కెర స్థాయిలు మరీ అధికంగా ఉండవు కానీ కాస్త ఎక్కువగా ఉంటాయి. దీన్ని పట్టించుకోకపోతే డయాబెటిస్ స్టేజిలోకి వెళ్తారు. వీరికి సాధారణంగా వైద్యులు మందులను ఇవ్వరు. కొన్నిరోజుల పాటు డైట్, వ్యాయామం చేయాలని సూచిస్తారు. ప్రీ డయాబెటీస్ ఉన్న కొందరికి షుగర్ లక్షణాలుంటాయి. కానీ 35 ఏళ్లు దాటాక అందరూ షుగర్ టెస్టులు చేయించుకోవడం మంచిది.
News February 7, 2026
FEB 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం

TG: మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పోలింగ్ రోజైన ఫిబ్రవరి 11న స్థానిక సెలవు ప్రకటించాలని SEC జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఆ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని తెలిపింది. ప్రైవేట్ పరిశ్రమలకూ సెలవు ఇవ్వాలని సూచించారు. ఓటర్లు ఎటువంటి ఆటంకం లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో సెలవు ప్రకటిస్తున్నట్లు SEC వెల్లడించింది.


