News October 17, 2024
ఆగర్భ శ్రీమంతుడైన టాటా వాచ్ ధర ఎంతో తెలుసా?

రతన్ టాటా అపర కుబేరుడు. టాటాల వారసుడు. ఆగర్భ శ్రీమంతుడు. అలాంటి వ్యక్తి వాడే వస్తువులంటే ఎంత ధర ఉండాలి? ఓ సినిమాలో డైలాగ్‌లా ఆయన వాచ్ అమ్మితే ఓ మధ్య తరగతి మనిషి లైఫ్ సెటిల్ అయిపోవాలి. కానీ కేవలం టైమ్ చూసేందుకు అంత ఖర్చెందుకు అని భావించేవారాయన. విక్టోరినాక్స్ బ్రాండ్‌కు చెందిన సుమారు రూ.10వేల విలువైన స్విస్ ఆర్మీ వాచ్‌ని మాత్రమే రతన్ ధరించేవారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమంటే ఇదే కదా!
Similar News
News October 30, 2025
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంలో ఉద్యోగాలు

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం 7 క్యూరేటర్-B ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. ఎంఎస్సీ/బీఈ/బీటెక్/MS/ఎంటెక్/పీహెచ్డీ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నవంబర్ 7 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://ncsm.gov.in/
News October 30, 2025
పశువులకు మేలు చేసే సూపర్ నేపియర్ గడ్డి

పచ్చి గడ్డిలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. సూపర్ నేపియర్ గడ్డిలో 10-12 శాతం మాంసకృత్తులు, 50-55% జీర్ణమయ్యే పదార్థాలు, 28-30 శాతం పీచుపదార్థం ఉంటుంది. ఈ గడ్డిలో చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, పశువులు ఇష్టంగా తింటాయి. దీనివల్ల పాడిపశువుల్లో ఎదుగుదల, సంతానోత్పత్తితో పాటు పాల దిగుబడి పెరుగుతుంది. సూపర్ నేపియర్ గడ్డిని తప్పనిసరిగా చాఫ్ కట్టర్‌తో చిన్న ముక్కలుగా కత్తిరించి పశువులకు వేయాలి.
News October 30, 2025
ఇతిహాసాలు క్విజ్ – 51

1. బ్రహ్మ ఆవలింత నుంచి పుట్టిన వానరుడు ఎవరు?
2. ద్రోణాచార్యుడికి ఏకలవ్యుడు ఇచ్చిన గురుదక్షిణ ఏంటి?
3. కృష్ణుడి భార్య అయిన రుక్మిణికి తండ్రి ఎవరు?
4. దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి శివుని నుదుటి నుంచి జన్మించిన వీరుడు ఎవరు?
5. గరుత్మంతుడి తల్లి ఎవరు?
☞ సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>


