News April 17, 2024
యమ ధర్మరాజుకి ఆలయం.. ఎక్కడో తెలుసా?

దేవాలయాలకు ప్రసిద్ధి అయిన మన దేశంలో మృత్యుదేవుడైన యమరాజుకీ ఆలయం ఉంది. ధర్మేశ్వర మహదేవ అని పిలిచే ఈ ఆలయం హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా(D) భర్మోర్‌లో ఉంది. చనిపోయిన వారి ఆత్మలన్నీ ఇక్కడికి చేరుకున్న తర్వాతే ఈ లోకాన్ని విడిచిపెడతాయని స్థానికుల నమ్మకం. చాలా మంది ఇక్కడికి వచ్చేందుకు భయపడతారట. ఎవరైతే భయం లేకుండా వచ్చి పూజిస్తారో వారికి అకాల మరణం ఉండదని అంటుంటారు. ఇక్కడ చిత్రగుప్తుడికీ ప్రత్యేక గది ఉంది.
Similar News
News November 21, 2025
సిటీలో మరో ఉపఎన్నిక.. 3 రోజుల తర్వాత క్లారిటీ!

సిటీలో మరో ఉపఎన్నిక రానుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలపై 4 వారాల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ పార్టీ మార్పుపై స్పీకర్‌కు సమాధానం ఇవ్వలేదు. కాగా దానంకు స్పీకర్ 3రోజులు గడువిచ్చారు. ఈలోపు ఆయన నుంచి స్పందనరాకపోతే ‘అనర్హత’పై స్పీకర్ నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది. అదే జరిగితే ఇక్కడ ఉపఎన్నిక ఖరారైనట్లే.
News November 21, 2025
OFFICIAL: రెండో టెస్టుకు కెప్టెన్‌గా పంత్

గువాహటి వేదికగా రేపటి నుంచి సౌతాఫ్రికాతో జరిగే రెండో టెస్టుకు కెప్టెన్ గిల్ దూరమైనట్లు BCCI ప్రకటించింది. దీంతో జట్టుకు పంత్ నాయకత్వం వహించనున్నట్లు వెల్లడించింది. మెడకు గాయం కారణంగా తొలి టెస్టులోనూ గిల్ బ్యాటింగ్ చేయలేకపోయిన విషయం తెలిసిందే. చికిత్స తర్వాత గువాహటికి వెళ్లినప్పటికీ క్రికెట్ ఆడేందుకు అతను ఫిట్‌గా లేడని BCCI తెలిపింది. మరిన్ని టెస్టులు, చికిత్స కోసం ముంబై వెళ్తున్నట్లు పేర్కొంది.
News November 21, 2025
ఏపీ సచివాలయం వద్ద భద్రత పెంపు

AP: రాష్ట్రంలో మావో అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్, మరో 51 మంది మావోయిస్టులు అరెస్టయిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెలగపూడి సచివాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే ఉద్యోగుల ఐడీ కార్డులను పరిశీలించిన తర్వాతే లోపలికి పంపుతున్నారు. విజయవాడ పరిసరాల్లో మరింత మంది మావోలు ఉండొచ్చనే సమాచారంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.


