News February 4, 2025
ఆక్సిజన్ అధికంగా అందించే చెట్లు మీకు తెలుసా?

1.మర్రిచెట్టు- అధికంగా ఆక్సిజన్ అందించటంతో పాటు వాతావరణంలో CO2 శాతాన్ని తగ్గిస్తుంది.2 వేప- సహజ క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది.3 రావి- రాత్రివేళల్లోనూ ఆక్సిజన్ అందిస్తుంది. పర్యావరణ రక్షణకు ఎంతోమేలు. 4 కరివేపాకు 5వెదురుబొంగు- ఇతరవాటితో పోలిస్తే 33శాతం అధికంగా ప్రాణవాయువును విడుదల చేస్తాయి.
*మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, తులసి, కలబంద మొక్కలు సైతం అధిక మోతాదులో ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తాయి.
Similar News
News December 20, 2025
మల్లన్న భక్తులకు ఊరట

శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనాల సమయం పెంచుతున్నట్లు ప్రకటించడం భక్తులకు ఊరటనిచ్చే విషయం. జనవరి నుంచి వీకెండ్స్లో 6 స్లాట్లలో భక్తులకు లింగాన్ని తాకి దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తామని EO వెల్లడించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే శని, ఆది, సోమవారాల్లో 7am-8:30am, 11:45am-2pm, 9pm-11pm స్లాట్లలో స్పర్శ దర్శనం ఉంటుంది. HYD, ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగులు, ఫ్యామిలీస్ వీకెండ్లో ఎక్కువగా వెళ్తున్నారు.
News December 20, 2025
వరి సన్నాలు పండించిన రైతులకు బోనస్ జమ

TG: ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలో వరి సన్నాలను పండించిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం బోనస్ జమ చేసింది. నిన్న ఒక్కరోజే 2,49,406 మంది రైతుల ఖాతాల్లో క్వింటాకు రూ.500 బోనస్ చొప్పున రూ.649.84 కోట్లను విడుదల చేసింది. ఈ ఏడాది వానాకాలంలో 30.35 లక్షల టన్నుల సన్నవడ్లను సర్కారు సేకరించింది. ప్రభుత్వం నిర్దేశించిన 33 రకాల సన్న బియ్యం వరి రకాలను సాగు చేసిన రైతులకు క్వింటాకు అదనంగా రూ.500 చొప్పున బోనస్ జమైంది.
News December 20, 2025
సన్న బియ్యం బోనస్ జమ కాకపోతే ఏం చేయాలి?

TG: వరి సన్నాలు సాగు చేసిన రైతుల అకౌంట్లలో సర్కారు బోనస్ జమ చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన 33 రకాల సన్నబియ్యం రకాలను పండించిన రైతులకు మాత్రమే బోనస్ పడుతుంది. ఒకవేళ రైతు ఖాతాల్లో బోనస్ జమ కాకపోతే బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయ్యిందో లేదో సరిచూసుకోవాలి. పౌరసరఫరాలశాఖ వెబ్సైట్లోని ‘ఫార్మర్ కార్నర్’లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు లేదా మండల వ్యవసాయ అధికారి లేదా కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జ్ను సంప్రదించాలి.


