News February 3, 2025
వీటి పూర్తి పేర్లు మీకు తెలుసా?

నిత్యం ఏదోచోట మనం వినియోగించే వస్తువుల కంపెనీల ఫుల్‌ఫామ్స్ చాలా మందికి తెలియదు. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం. TVS- తిరుక్కురుంగుడి వెంగారం సుందరం, SYSKA- శ్రీ యోగి సంత్ కృపా అనంత్, WIPRO- వెస్ట్రన్ ఇండియా పామ్ రిఫైన్డ్ ఆయిల్స్ లిమిటెడ్, HDFC- హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, PAYTM- పే థ్రూ మొబైల్, MRF- మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ. మీకు ఇంకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి.
Similar News
News November 4, 2025
రబీలో వరికి బదులు ఆరుతడి పంటలతో లాభాలు

రబీ కాలంలో వరి కన్నా ఆరుతడి పంటల సాగుకు అవసరమయ్యే నీరు, విద్యుచ్ఛక్తి, పెట్టుబడి తక్కువగా ఉంటుంది. ఎకరం వరి సాగుకు అవసరమయ్యే నీటితో కనీసం 2 నుంచి 8 ఎకరాల విస్తీర్ణంలో ఆరుతడి పంటలను సాగు చేయవచ్చు. పంట మార్పిడి వల్ల పంటలను ఆశించే తెగుళ్లు, పురుగులు తగ్గుతాయి. నిత్యావసరాలైన పప్పులు, నూనె గింజలు, కూరగాయల కొరత తగ్గుతుంది. పప్పు ధాన్యపు పంటలతో పంట మార్పిడి వల్ల భూసారం పెరుగుతుంది.
News November 4, 2025
వరి మాగాణుల్లో పంట ఎంపిక.. ఇవి ముఖ్యం

వరి మాగాణుల్లో పంట ఎంపికకు ముందు రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం. రైతులు ఎంపిక చేసుకునే ప్రత్యామ్నాయ పంటలకు స్థిరమైన మార్కెట్, మద్దతు ధర ఉండేలా చూసుకోవాలి. కనీస మద్దతు ధర, పంట భీమా, నాణ్యమైన విత్తనాలు సకాలంలో లభించే పంటలను ఎన్నుకోవాలి. వరికి ప్రత్యామ్నాయంగా ఎన్నుకునే పంటలు తక్కువ నీటిని వినియోగించుకొని, దిగుబడిని అందించేవి అయ్యి ఉండాలి.
News November 4, 2025
గర్భనిరోధక మాత్రలతో స్ట్రోక్ ముప్పు

అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు చాలామంది మహిళలు గర్భనిరోధక మాత్రలు వాడుతుంటారు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు ఉన్న గర్భనిరోధక మాత్రలు వాడే మహిళలకు క్రిప్టోజెనిక్ స్ట్రోక్ ముప్పు ఎక్కువని పరిశోధకులు గుర్తించారు. మెదడుకు రక్తసరఫరా జరిగే మార్గంలో రక్తం గడ్డకట్టి ఈ స్ట్రోక్ వస్తుంది. మహిళలకు వస్తున్న స్ట్రోక్‌లలో దాదాపు 40% దాకా క్రిప్టోజెనిక్ ఐషెమిక్ స్ట్రోక్‌లేనని తెలిపారు.


