News December 5, 2024

ఏపీలోనూ ఒక పాకిస్థాన్ ఉందని తెలుసా?

image

AP: రాష్ట్రంలోని విజయవాడలో పాకిస్థాన్ పేరుతో ఓ కాలనీ ఉంది. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించింది. అదే సమయంలో పాక్, బంగ్లాదేశ్ విడిపోవడంతో ఇరు దేశాల సరిహద్దుల్లోని అనేక కుటుంబాలు నిరాశ్రయులు కావడంతో అప్పటి ప్రధాని దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారికి ఆశ్రయం కల్పించారు. 1984లో నగరంలోని పాయకాపురం ప్రాంతంలో 40 ఇళ్లతో ఓ కాలనీ ఏర్పాటైంది. దానికి పాకిస్థాన్ కాలనీగా నామకరణం చేశారు.

Similar News

News November 21, 2025

KNR: మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా పర్యటన రద్దు

image

నేడు కరీంనగర్‌లో జరగాల్సిన మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన వాయిదా పడింది. హైదరాబాదులో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రోగ్రాం వాయిదా పడ్డట్లు మంత్రి కార్యాలయం తెలిపింది. LMD వద్ద నిర్వహించనున్న చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తారని, కొత్తపల్లి మండలంలో నిర్వహించే మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. దీనిని మరోరోజు నిర్వహించనున్నారు.

News November 21, 2025

యాషెస్ సిరీస్.. టాస్ గెలిచిన ఇంగ్లండ్

image

యాషెస్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
☛ AUS XI: ఖవాజా, వెదరాల్డ్, లబుషేన్, స్మిత్(C), హెడ్, గ్రీన్, క్యారీ, స్టార్క్, లియాన్, బ్రెండన్ డాగెట్, బోలాండ్
☛ ENG XI: డకెట్, క్రాలే, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్(C), J స్మిత్, అట్కిన్సన్, కార్స్, ఆర్చర్, వుడ్
☛ LIVE: స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్

News November 21, 2025

iBOMMA రవి కేసును ఫ్రీగా వాదిస్తానన్న లాయర్.. తండ్రి ఏమన్నారంటే?

image

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసును ఉచితంగా వాదించి అతన్ని బయటకు తీసుకొస్తానంటూ సలీమ్ అనే న్యాయవాది ముందుకొచ్చారు. విశాఖ జిల్లా పెదగదిలి సాలిపేటలో ఉంటున్న రవి తండ్రి అప్పారావును ఆయన కలిశారు. కేసును వాదించేందుకు కొన్ని పేపర్లపై సంతకాలు పెట్టాలని కోరగా తాను నిరాకరించినట్లు అప్పారావు తెలిపారు. తన ఆరోగ్యం సహకరించనందున కోర్టుల చుట్టూ తిరగలేనని చెప్పానన్నారు.