News August 13, 2024

తిరుమల శ్రీవారి గురించి ఈ విషయం తెలుసా?

image

తిరుమల వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ విగ్రహం గురించి రమణ దీక్షితులు గతంలో ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు. భక్తులు స్వామివారి ముఖాన్ని మాత్రమే చూడగలరని, కానీ వెనుకవైపు నుంచే అందంగా ఉంటారని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీనిని స్వామివారి అర్చకులు మాత్రమే చూడగలరన్నారు. వెనుక భాగంలో శిరస్సు చక్రం, వంపులు తిరిగిన వెంట్రుకలు, యజ్ఞోపవీతం, కౌపీనం, బాజీ బందులు, కుచ్చులు స్పష్టంగా కనిపిస్తాయని వివరించారు.

Similar News

News January 31, 2026

విజయనగరం: ‘రోడ్డు ప్ర‌మాదాల‌ను నివారించండి’

image

రోడ్డు ప్ర‌మాదాల‌ను నివారించేందుకు అవ‌స‌ర‌మైన అన్నిరకాల‌ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా రెవెన్యూ అధికారి ఇ.ముర‌ళి కోరారు. జిల్లా ర‌హ‌దారి భ‌ద్ర‌తా క‌మిటీ స‌మావేశం డీఆర్ఓ ఛాంబ‌ర్‌లో శ‌నివారం జ‌రిగింది. జిల్లాలో రోడ్డు ప్ర‌మాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించారు. రోడ్డు ప్ర‌మాద కేసుల‌ను త్వ‌ర‌గా ప‌రిష్క‌రించి, బాధితుల‌కు న్యాయం చేయాల‌ని డీఆర్ఓ సూచించారు.

News January 31, 2026

10 రోజుల్లో కొత్త సినిమా అప్డేట్: అనిల్

image

కొత్త సినిమాపై మరో 10-15 రోజుల్లో అప్డేట్ ఇస్తానని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు. మూవీపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాక ఆయన మీడియాతో మాట్లాడారు. తన తర్వాతి మూవీ వెంకటేశ్‌తో తీస్తున్నారని, కార్తీ లేదా ఫహాద్ ఫాజిల్ నటించే అవకాశం ఉందని సినీవర్గాల టాక్. ఇటీవల చిరంజీవి హీరోగా ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రంతో అనిల్ సూపర్ హిట్ అందుకోవడం తెలిసిందే.

News January 31, 2026

కృష్ణుడికి సైతం ఆగ్రహం తెప్పించే కొన్ని పనులివే!

image

నిత్యం స్నానం చేయకుండా ఉన్నవారిపై శ్రీకృష్ణుడు కోపంగా ఉంటాడని పండితులు చెబుతున్నారు. ఆడవాళ్లు కొన్ని సందర్భాల్లో తులసిని తాకడం, సూర్యాస్తమయం తర్వాత, ఏకాదశి వంటి పవిత్ర దినాల్లో తులసిని కోయకూడదని అంటున్నారు. దానివల్ల ఆయన తీవ్ర అసహనానికి గురవుతాడట. అలాగే, నిష్కామ కర్మను విస్మరించి ఫలితం కోసం పాకులాడటం, ధర్మాన్ని తప్పి అధర్మ మార్గంలో పయనించడం కూడా కృష్ణుడికి నచ్చవని అంటున్నారు.