News February 4, 2025
ఈ రికార్డు తెలుసా? 64 రోజుల పాటు గాల్లోనే విమానం

ఓ విమానం గాలిలో ఎంత సేపు ఉంటుంది. మహా అంటే 12-24 గంటలు. కానీ, రాబర్ట్ టిమ్ & జాన్ కుక్ అనే ఇద్దరు పైలెట్లు 1959లో 64 రోజుల 22 గంటల 19 నిమిషాల పాటు విమానాన్ని లాస్ వెగాస్ మీదుగా నడిపి రికార్డు సృష్టించారు. ఇంధనం అయిపోకుండా ఉండేందుకు ఓ ట్రక్కుతో పైపు లైన్ ద్వారా అందిస్తూ విమానాన్ని నిరంతరంగా నడిపించారు. US ఆర్మీ ఈ రికార్డు బ్రేక్ చేసేందుకు ప్రయత్నించగా 64 రోజుల 18గంటల వద్ద విమానం కుప్పకూలింది.
Similar News
News March 28, 2026
IPL రికార్డ్స్.. ఈసారైనా బద్దలవుతాయా?

☛ ఒకే సీజన్(2016)లో కోహ్లీ రన్స్-973
☛ పుణే వారియర్స్‌పై గేల్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోర్-175*, ఫాస్టెస్ట్(30 బంతుల్లో) సెంచరీ, ఒకే ఇన్నింగ్సులో హయ్యెస్ట్ సిక్సులు-17
☛ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్(12 పరుగులిచ్చి 6 వికెట్లు.. అల్జారీ జోసెఫ్-MI)
☛ అత్యధిక టీమ్ స్కోర్- 287/3(SRH)
☛ ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం-229 రన్స్(2016లో గుజరాత్ లయన్స్‌పై కోహ్లీ-ABD నెలకొల్పారు)
News March 28, 2026
ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ఫీజు పెంపు.. మరో 4 రోజుల్లో అమల్లోకి

ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ఫీజు రూ.3,000 నుంచి రూ.3,075కి పెరగనుంది. ఫీజు పెంపు నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని NHAI వెల్లడించింది. ప్రస్తుత ధరతో పాస్‌ను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు మరో 4 రోజులే అవకాశం ఉందని పేర్కొంది. వన్ టైమ్ పేమెంట్‌తో ఏడాదిపాటు లేదా 200 ట్రిప్స్ ఎలాంటి అంతరాయం లేకుండా NHలపై ప్రయాణించవచ్చని తెలిపింది. రాజ్‌మార్గ్ యాత్ర యాప్ ద్వారా పాస్‌ను యాక్టివేట్ చేసుకోవాలంది.
News March 28, 2026
మోదీ-ట్రంప్ కాల్‌లో ఎలాన్ మస్క్ లేరు: కేంద్రం

ప్రధాని మోదీ, US ప్రెసిడెంట్ ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ కాల్‌లో ఎలాన్ మస్క్ పాల్గొన్నట్లు వచ్చిన వార్తలను కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి ఖండించారు. ఈ నెల 24న మోదీ, ట్రంప్ మధ్య మాత్రమే టెలిఫోన్ సంభాషణ జరిగిందని స్పష్టం చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై వారు మాట్లాడుకున్నారని తెలిపారు.


