News August 6, 2024
తిరుమల శ్రీవారి ఆభరణాలేంటో తెలుసా?

తిరుమల శ్రీవారిని దగ్గర నుంచి చూసే భాగ్యం లభించదు. దీపాల వెలుగులో మెరిసిపోతున్న తిరుమలేశుని చూసి భక్తులు తరిస్తుంటారు. ఆయన ధరించే బంగారు ఆభరణాలేంటో తెలిపే ఫొటో ఒకటి వైరలవుతోంది. ఆయన ఆభరణాలివే.. కిరీటం, మకర కుండలం, చక్ర, శంఖు, వైజయంతి హారం, నాగాభరణం, దశావతార కంకణం, కటి హస్త, యజ్ఞోపవీతం, తులసీ మాల, సూర్య కటారి, వరద హస్త ఉంటాయి.
Similar News
News November 25, 2025
సర్పంచి రిజర్వేషన్లు.. జిల్లెల్లలో ఆశలు- నిరాశలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచి రిజర్వేషన్లు ఖరారు చేస్తూ నవంబర్ 23న నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో తంగళ్లపల్లి మండలంలో ఆశావహుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా జిల్లెల్ల గ్రామంలోని నాలుగు కూడళ్లలో, టీ స్టాళ్ల వద్ద పంచాయతీ ఎన్నికలపై చర్చలు మరింత జోరందుకున్నాయి. పీఠం ఎవరికి దక్కుతుందన్న ఊహాగానాలు వేగంగా మారుతుండగా, రిజర్వేషన్ కారణంగా కొందరు ఆశావహులు నిరాశకు గురవుతున్నారు.
News November 25, 2025
లిప్స్కీ LED మాస్క్

ప్రస్తుతం LED మాస్క్ల ట్రెండ్ కొనసాగుతోంది. ఇవి సౌందర్య పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. దీంతో లిప్స్కీ LED మాస్క్ వచ్చింది. దీన్ని నోటిపై పెట్టుకొని సపోర్ట్ హ్యాండిల్ని పళ్లతో పట్టుకోవాలి. డివైజ్ స్విచ్ ఆన్/ ఆఫ్ బటన్స్ ఉంటాయి. వీటిని వాడటం వల్ల పెదాలపై ఉండే ముడతలు, గీతలు పోయి అందంగా మెరుస్తాయి. ఇది ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రయత్నించి చూడండి.
News November 25, 2025
ఆకుకూరల సాగుకు నేల తయారీ, ఎరువులు

ఆకుకూరల సాగు కోసం నేలను 3-4 సార్లు దున్ని చదును చేయాలి. పంటను బట్టి నేల తయారీలో ఎకరాకు 6-10 టన్నుల చివికిన పశువుల ఎరువు, 20 నుంచి 30 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 10-20 కిలోల యూరియా, పొటాష్ ఎరువులు వేసి నేలను సిద్ధం చేయాలి. తర్వాత అధిక వర్షాలకు నీరు ఇంకిపోయే విధంగా ఎత్తు మడులను, వాన నీరు నిల్వ ఉండకుండా నేలను తయారు చేసుకోవాలి. ఎత్తు మడుల వల్ల భారీ వర్షాలు కురిసినా పంటకు తక్కువ నష్టం జరుగుతుంది.


