News October 8, 2025
రెయిన్‌బో బేబీ అంటే ఏంటో తెలుసా?

వివిధ కారణాల వల్ల కొందరు పేరెంట్స్ ముందు బిడ్డను/బిడ్డలను కోల్పోతారు. ఆ తర్వాత పుట్టేవారినే రెయిన్‌బో బేబీస్ అంటారు. వైద్యులు ఈ బేబీస్ విషయంలో కాస్త ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వీరిని కొంతకాలం ఆసుపత్రిలో ఉంచాల్సి రావచ్చు. ఇంద్రధనస్సు అనేది వర్షం తర్వాత కనిపించే అందమైన రంగుల సమ్మేళనం. అలాగే ఈ బేబీస్ తల్లిదండ్రులకు కొత్త జీవితాన్ని, ఆనందాన్ని ఇస్తారు. అందుకే వారిని రెయిన్‌బో బేబీస్ అంటారు.
Similar News
News October 8, 2025
పాకిస్థాన్ ఘోర ఓటమి

WWCలో భాగంగా AUSతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 107 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. తొలుత AUS 9 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. 222 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ జట్టు ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. సిద్రా అమీన్(35) మినహా మరెవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. ఆసీస్ బౌలర్లలో గార్త్ 3 వికెట్లతో రాణించారు. WWCలో ఆడిన 3 మ్యాచుల్లోనూ పాక్ ఓడింది. దీంతో పాయింట్ల టేబుల్‌లో చివర నిలిచింది.
News October 8, 2025
‘జోహో’కు జయహో అంటున్న కేంద్రం

PM మోదీ ‘స్వదేశీ’ పిలుపు ‘<<17874488>>ZOHO<<>>’ మెయిల్, ‘ARATTAI’ మెసేజింగ్ యాప్‌కు కలిసొచ్చింది. శ్రీధర్ వెంబు స్థాపించిన ఈ సంస్థలకు కొన్నేళ్లుగా రాని గుర్తింపు కొద్దిరోజుల్లోనే సొంతమైంది. ఇటీవల కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ZOHO’కు మారగా ఇవాళ హోంమంత్రి అమిత్‌షా జోహో మెయిల్ (amitshah.bjp@ http://zohomail.in) క్రియేట్ చేసుకున్నారు. స్వయంగా కేంద్రమే ఫ్రీ పబ్లిసిటీ చేస్తుండటంతో యూజర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.
News October 8, 2025
అమరావతి జోనింగ్ రూల్స్ మార్పులపై చర్చ

AP: అమరావతి రాజధాని ప్రాంతంలో జోనింగ్ నిబంధనల్లో మార్పులు చేయనున్నారు. హోటళ్ల పార్కింగ్ నియమావళిలోనూ కొన్ని సవరణలు చేయాలని నిర్ణయించారు. CM CBN అధ్యక్షతన జరిగిన CRDA సమావేశంలో వీటిపై చర్చించారు. రాజ్‌భవన్ నిర్మాణానికి పాలనానుమతి, HOD టవర్లపై మాట్లాడారు. రాజధాని వెలుపల అభివృద్ధి పనులకు భూ లభ్యతతో పాటు హ్యాపీ నెస్ట్, ఏపీ ఎన్నార్టీ ప్రాజెక్టులకు ఫీజుల మినహాయింపు, STPల ఏర్పాటు అంశాలు చర్చకు వచ్చాయి.