News August 24, 2025
DVT అంటే ఏంటో తెలుసా?

Deep Vein Thrombosis (<<17502186>>DVT<<>>) బారిన పడితే రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతుంది. ఇది సాధారణంగా కాళ్లలోని లోతైన సిరల్లో ఏర్పడుతుంది. ఊపిరితిత్తుల వరకు చేరుకుంటే Pulmonary Embolismకు దారి తీస్తుంది. దీంతో ఊపిరితిత్తులకు రక్తప్రవాహం ఆగి, ఆక్సిజన్ తగ్గుతుంది. ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చు. హార్మోనల్ పిల్స్, ఎక్కువ సేపు కూర్చోవడం, సర్జరీ తర్వాత యాక్టివ్‌గా ఉండకపోతే DVT రిస్క్ పెరుగుతుందని డాక్టర్లు తెలిపారు.
Similar News
News August 24, 2025
గుడ్‌న్యూస్.. మండపాలకు ఉచిత విద్యుత్

TG: వినాయక చవితి, దుర్గాదేవి నవరాత్రుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గణేశ్, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మండపాలకు అనుమతి ఉన్నవారు ఎక్కడి నుంచి విద్యుత్ కనెక్షన్ తీసుకుంటారనే వివరాలు సమర్పించాలని సూచించింది. కాగా ఉచిత విద్యుత్‌కు సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం నుంచి తీసుకుంటామని అధికారులు తెలిపారు.
News August 24, 2025
లైఫ్ సైన్సెస్‌కు తెలంగాణ కేంద్రం: సీఎం

TG: బయోడిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్‌లో CM రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దేవుడు గొప్ప డిజైనర్. ప్రకృతి ఉత్తమ గురువు. మనం మంచి విద్యార్థులమా కాదా అన్నదే ప్రశ్న. తెలంగాణ రైజింగ్ 2047 అనే ప్రయాణాన్ని ప్రారంభించాం. అప్పటి వరకు రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం. లైఫ్ సైన్సెస్‌కు రాష్ట్రం కేంద్రంగా ఉంది. ఆవిష్కరణలు చేయడానికి TG సరైన వేదిక’ అని వ్యాఖ్యానించారు.
News August 24, 2025
వచ్చే ఏడాది నుంచి నేచర్ క్యూర్ వైద్య కళాశాలలో అడ్మిషన్లు

AP: విశాఖలోని తొలి నేచర్ క్యూర్ వైద్య కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు మొదలవుతాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు. విశాఖ, కాకినాడలో ఆయుష్ ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రులు సిద్ధమవుతున్నాయన్నారు. విశాఖలోనే ఆయుర్వేద మందుల తయారీ, నాణ్యత పరీక్షల ప్రయోగశాల రాబోతోందని వెల్లడించారు. కళాశాల పక్కనే 50 పడకలతో చేపట్టిన ఆయుష్ ఇంటిగ్రేటెడ్ ఆసుపత్రి నిర్మాణం కూడా చివరి దశలో ఉన్నట్లు తెలిపారు.