News July 15, 2024

గ్రాండ్‌ స్లామ్ అంటే ఏంటో తెలుసా?

image

టెన్నిస్‌లో <<13629724>>గ్రాండ్ స్లామ్<<>> అంటే ఏడాది కాలంలో 4 మేజర్ ఛాంపియన్షిప్స్ గెలవడం. ఒక గ్రాండ్ స్లామ్ సాధించాలంటే ఏడాదిలో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, US ఓపెన్ గెలవాలి. టెన్నిస్‌లో ఇదే అతి పెద్ద ఫీట్. డబుల్స్‌లో ఒక ప్లేయర్ వేర్వేరు పార్ట్‌నర్స్‌తో దీన్ని సాధించవచ్చు. ఆస్ట్రేలియాకు చెందిన రాడ్ లావర్(11) అత్యధిక గ్రాండ్ స్లామ్స్‌ గెలిచారు. IND ఖాతాలో 4 డబుల్స్ గ్రాండ్ స్లామ్స్ ఉన్నాయి.

Similar News

News December 4, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* TGలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం(D) నాయకన్‌గూడెం చెక్‌పోస్ట్ వద్ద AP CM చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కారు తనిఖీ చేసిన పోలీసులు
* ఈ నెల 11న కడప మేయర్, కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు SEC నోటిఫికేషన్ జారీ.. అవినీతి ఆరోపణలతో ఇటీవల కడప మేయర్‌(YCP)ను తొలగించిన ప్రభుత్వం
* మూడో వన్డే కోసం విశాఖ చేరుకున్న IND, RSA జట్లు.. ఎల్లుండి మ్యాచ్

News December 4, 2025

రూ.5 లక్షలకు అఖండ-2 టికెట్‌

image

AP: అఖండ-2 మూవీ టికెట్‌ను చిత్తూరు MLA గురజాల జగన్‌మోహన్ రూ.5 లక్షలకు కొన్నారు. తనకు బాలకృష్ణపై ఉన్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నారు. బాలకృష్ణ అభిమానుల సంఘం నాయకులు MLAను కలిసి సినిమా టికెట్‌ను అందజేశారు. ఓ అభిమానిగా సినిమా విజయవంతం కావాలని ఆయన కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే సాంకేతిక సమస్యల కారణంగా అఖండ-2 మూవీ ప్రీమియర్స్‌ను నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ రద్దు చేసిన విషయం తెలిసిందే.

News December 4, 2025

Dec 11న మిస్సైల్ టెస్ట్.. NOTAMకు కేంద్రం నోటీస్

image

విశాఖ తీరంలో మిస్సైల్ పరీక్ష పరిధిని 1,050 కి.మీ నుంచి 1,190 కి.మీకు కేంద్రం విస్తరించింది. DEC 11న మిస్సైల్ పరీక్ష నిర్వహించనున్నట్టు NOTAMకు తెలిపింది. డిసెంబర్ 1-4 మధ్య నిర్వహించే టెస్ట్‌కు 3,485 కి.మీలు డేంజర్ జోన్‌గా గుర్తించాలని నోటీసులిచ్చిన కేంద్రం తర్వాత కాన్సిల్ చేసింది. ATC, రన్ వే రిపేర్లు, ఎయిర్‌స్పేస్ క్లోజింగ్స్, విమాన కార్యకలాపాలు, భద్రతా పర్యవేక్షణలో NOTAMs కీలకంగా పనిచేస్తాయి.