News February 26, 2025
‘నమశ్శివాయ’ అంటే ఏంటో తెలుసా?

‘ఓం నమశ్శివాయ’ అనే మంత్రంలో ‘న, మ, శి, వా, య’ అనే పంచాక్షరాలు ఉన్నాయి.
1. ‘న’ అంటే నభం- ఆకాశం
2. ‘మ’ అంటే మరుత్- గాలి
3. ‘శి’ అంటే శిఖి- అగ్ని
4. ‘వా’ అంటే వారి- నీరు
5. ‘య’ అంటే యజ్ఞం- భూమి
Similar News
News February 26, 2025
మార్చి 1న ‘కన్నప్ప’ టీజర్!

మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న ‘కన్నప్ప’ సినిమా టీజర్ విడుదలకు సిద్ధమైంది. మార్చి 1వ తేదీన టీజర్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటిస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. ఇప్పటికే రిలీజైన ‘శివ శివ శంకరా’ సాంగ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ చిత్రంలో మంచు మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న విడుదలవనుంది.
News February 26, 2025
రెండో రోజు ముగిసిన వల్లభనేని వంశీ విచారణ

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీ రెండో రోజు కస్టడీ విచారణ ముగిసింది. కృష్ణలంక పీఎస్‌లో 5 గంటలపాటు ఆయనను పోలీసులు విచారించారు. టెక్నికల్ ఎవిడెన్స్ చూపించి సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల వెనుక ఎవరున్నారన్న కోణంలో ప్రశ్నించినట్లు సమాచారం. వంశీతో పాటు మరో ఇద్దరు నిందితులను విచారించారు. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం విజయవాడ జిల్లా జైలుకు తీసుకెళ్తారు.
News February 26, 2025
టాప్-5లోకి కోహ్లీ

ఐసీసీ మెన్స్ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కింగ్ కోహ్లీ టాప్-5లోకి దూసుకొచ్చారు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో సెంచరీ చేయడంతో ఒక ర్యాంకు మెరుగుపరుచుకొని ఐదో ర్యాంకుకు చేరారు. ఇక నం.1 స్థానంలో 817 పాయింట్లతో గిల్ కొనసాగుతున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో బాబర్, రోహిత్ శర్మ, క్లాసెన్ ఉన్నారు. మరోవైపు వన్డేల్లో టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు 120 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.