News February 22, 2025

FBI విధులేంటో మీకు తెలుసా..?

image

FBI అమెరికాలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ. టెర్రరిజం, సైబర్‌క్రైమ్, డ్రగ్స్‌లాంటి నేరాలను అరికట్టడానికి ఈ ఏజెన్సీ పనిచేస్తుంది. వాటితో పాటు అవినీతి ఆరోపణలపైనా విచారణ చేస్తుంది. అత్యున్నత శిక్షణ పొందిన కమాండోలు, సైబర్ నిపుణులు ఈ సంస్థలో పనిచేస్తారు. ఈఏజెన్సీకి 60కు పైగా దేశాల్లో కార్యాలయాలన్నాయి. గ్లోబల్ టెర్రరిజం, సైబర్ క్రైమ్, డ్రగ్స్ వంటి నేరాలపై సమాచారం సేకరించి ఆయా దేశాలకు అందిస్తోంది.

Similar News

News November 11, 2025

వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలు పారిపోయారు: సీఎం

image

AP: సంక్షేమం, అభివృద్ధిలో ఏపీ బ్రాండ్‌ను మళ్లీ తీసుకొస్తున్నామని CM చంద్రబాబు చెప్పారు. ప్రతి ఇంట్లో ఓ పారిశ్రామికవేత్త ఉండాలనేది తమ లక్ష్యమన్నారు. ప్రకాశం(D) కనిగిరిలో MSMEల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘YCP పాలనలో బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు పారిపోయారు. మా హయాంలో పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ప్రతి 50కి.మీలకు ఒక పోర్టు నిర్మిస్తాం’ అని పేర్కొన్నారు.

News November 11, 2025

ఆగాకర సాగు – అనుకూల పరిస్థితులు

image

ఆగాకర తీగజాతి పంట. అన్ని రకాల నేలల్లో ఈ పంటను సాగు చేయవచ్చు. అధిక కర్బన పదార్థం, మురుగు నీటి వసతి ఉన్న ఒండ్రు కలిగిన ఇసుక నేలలు ఈ పంట సాగుకు చాలా అనుకూలం. ఉదజని సూచిక 6-7 ఉన్న నేలలు సాగుకు అనువైనవి. ఆగాకర అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలదు. తేమతో కూడిన వెచ్చని వాతావరణంలో పంట పెరుగుదల బాగుంటుంది. 32-40 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రతల మధ్య అధిక దిగుబడిని, నాణ్యతను పొందవచ్చు.

News November 11, 2025

యాక్టివేటెడ్ చార్‌కోల్‌తో ఎన్నో లాభాలు

image

ప్రస్తుత కాలంలో ఫేస్ క్రీం, ఫేస్ వాష్ ఎందులో చూసినా యాక్టివేటెడ్ చార్‌కోల్ ఉంటోంది. దీంతో చాలా ప్రయోజనాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. * ఇది ఓపెన్ పోర్స్‌ను అన్‌క్లాగ్ చేస్తుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగించడానికి ఇది బాగా పని చేస్తుంది. * మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేయడంలో యాక్టివేటెడ్ చార్‌కోల్ కీలక పాత్ర పోషిస్తుంది. పొడిబారిన చర్మానికి తేమను అందిస్తుంది.