News September 26, 2024

తిరుమల డిక్లరేషన్ అంటే ఏంటో తెలుసా?

image

AP: వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిందేనని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. బ్రిటిష్ హయాం నుంచే అన్యమతస్థులు ఎవరైనా శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఫారంపై సంతకాలు చేసే సంప్రదాయం ఉంది. వేంకటేశ్వరస్వామిపై తమకు నమ్మకం, గౌరవం ఉందని, దర్శనానికి అనుమతించాలని అందులో సంతకం చేయాలి. 1933 ముందు వరకు మహంతులు దీన్ని పర్యవేక్షించారు.

Similar News

News September 26, 2024

జంట జలాశయాలకు భారీ వరద

image

TG: హైదరాబాద్ జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వస్తుండటంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. ఉస్మాన్ సాగర్ రెండు గేట్లు ఎత్తి 234 క్యూసెక్కులు, హిమాయత్ సాగర్ ఒక గేటు ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ఇటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News September 26, 2024

పీహెచ్సీ డాక్టర్లతో ముగిసిన చర్చలు

image

AP: పీహెచ్సీ డాక్టర్ల సంఘం ప్రతినిధులతో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చర్చలు ముగిశాయి. అన్ని క్లినికల్ విభాగాల్లో 20 శాతం ఇన్ సర్వీస్ రిజర్వేషన్ ఇచ్చేందుకు మంత్రి సుముఖత వ్యక్తం చేశారు. వెంటనే విధుల్లో చేరాలని సత్యకుమార్ వారిని కోరారు.

News September 26, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.