News September 4, 2025
GST తగ్గింపుతో ఏమవుతుందో తెలుసా?

GST శ్లాబుల కోతతో ప్రభుత్వానికి రూ.93వేల కోట్ల ఆదాయం తగ్గనుంది. అదే సమయంలో లగ్జరీ వస్తువులను 40% జీఎస్టీ శ్లాబులోకి తీసుకురావడం వల్ల రూ.45వేల కోట్ల ఆదాయం రానుంది. ఫలితంగా రూ.48వేల కోట్ల లోటు ఏర్పడనుంది. అయితే పన్ను తగ్గింపుతో ప్రజల వద్ద డబ్బు మిగులుతుంది. దాన్ని ఖర్చు చేసేందుకు ఇష్టపడతారు. దీంతో ఆ డబ్బు తిరిగి ఎకానమీలోకి వస్తుంది. పన్ను తగ్గించినా ప్రభుత్వానికి పెద్దగా నష్టం ఉండదు.
Similar News
News September 4, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

దాదాపు పది రోజులుగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ శాంతించాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.110 తగ్గి రూ.1,06,860కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.100 పతనమై రూ.97,950 పలుకుతోంది. అటు KG వెండి ధర రూ.1,37,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News September 4, 2025
ఫ్రీ బస్.. లోకల్ అడ్రస్ ఉంటే చాలు: అధికారులు

TG: అప్‌డేట్ చేయని ఆధార్ కార్డులపై రాష్ట్రం పేరు AP అని ఉంటే మహిళలకు జీరో టికెట్ ఇచ్చేందుకు కొందరు బస్ కండక్టర్లు నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై గ్రేటర్ RTC ED రాజశేఖర్ స్పందించారు. ఆధార్‌పై తెలంగాణ లోకల్ అడ్రస్ ఉంటే చాలని స్పష్టం చేశారు. ఒకవేళ కండక్టర్లు నిరాకరిస్తే 04069440000 TOLL FREE నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. అయితే ఆధార్ అప్‌డేట్ చేసుకుంటే మంచిదని అధికారులు సూచించారు.
News September 4, 2025
GST సంస్కరణలు.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు

కేంద్రం తీసుకొచ్చిన GST సంస్కరణలతో స్టాక్ మార్కెట్లలో కొత్త జోష్ కనిపించింది. దేశీయ సూచీలు లాభాలతో దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 630కు పైగా పాయింట్లు లాభపడి 81,198 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 50 పాయింట్లకు పైగా లాభపడి 24,895 వద్ద ట్రేడ్ అవుతోంది. M&M, HDFC, ICICI, బజాజ్ ఫైనాన్స్, ITC, భారతి ఎయిర్‌టెల్ వంటి కంపెనీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.