News October 12, 2024

దసరా రోజున రావణుడికి పూజ.. ఎక్కడో తెలుసా?

image

సాధారణంగా అన్ని చోట్ల విజయ దశమి రోజున రావణుడి దిష్టిబొమ్మని దహనం చేస్తారు. యూపీలోని కాన్పూర్‌లో మాత్రం రావణుడిని పూజిస్తారు. ఇక్కడ దశకంఠుడికి ఆలయం ఉంది. దసరా రోజునే తెల్లవారుజామునే దీనిని తెరుస్తారు. వేలాది మంది భక్తులు గుడికి వచ్చి రావణుడిని పండితుడిగా భావించి పూజలు చేస్తారు. ఆ తర్వాత ఆలయాన్ని సాయంత్రం కల్లా మూసివేస్తారు.

Similar News

News November 17, 2025

సత్వర న్యాయం అందించడమే లక్ష్యం: ఎస్పీ

image

ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకే పీజీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. సోమవారం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 58 అర్జీలు అందగా, వాటిలో 13 భూతగాదాలు, 18 కుటుంబ కలహాలు, 27 ఇతర విభాగాలకు చెందినవి ఉన్నాయి. ఈ అర్జీలను వెంటనే పరిష్కరించాలని ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్.హెచ్.ఓ.లకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.

News November 17, 2025

బెల్లం.. మహిళలకు ఓ వరం

image

నిత్యం ఇంట్లో, బయట పనులను చేస్తూ మహిళలు తమ ఆరోగ్యాన్ని విస్మరిస్తారు. సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల వారికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలా కాకూడదంటే బెల్లాన్ని తమ డైట్‌లో చేర్చుకోవాల్సిందే. శరీరానికి కావాల్సిన కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు బెల్లంలో పుష్కలంగా ఉంటాయి. బరువును తగ్గించడంతో పాటు వ్యాధినిరోధక శక్తిని పెంచుతుందంటున్నారు నిపుణులు.

News November 17, 2025

శ్రీవారి సన్నిధిలో ఆంజనేయుడి ఆలయం

image

తిరుమల శ్రీవారి ఆలయం సన్నిధిలో ఎత్తైన ప్రదేశంలో ‘శ్రీ బేడీ ఆంజనేయస్వామి ఆలయం’ కనిపిస్తుంది. బాల్యంలో హనుమంతుడు తన వాహనమైన ఒంటె కోసం తిరుగుతుండేవాడు. ఆ అల్లరిని కట్టడి చేయడానికి, తల్లి అంజనాదేవి ఆయనకు బేడీలు తగిలించి, తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా కుదురుగా ఉండమని నిలబెట్టిందట. అందుకే ఈ ఆలయం బేడీ ఆంజనేయస్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ స్వామి కట్టుబాటుకు ప్రతీక. <<-se>>#VINAROBHAGYAMU<<>>