News September 6, 2024

ఇంట్లో ప్రతిష్ఠించే గణపయ్యకు తొండం ఎటువైపు ఉండాలో తెలుసా?

image

ఏ కార్యమైనా మొదట పూజలందుకునేది గణనాథుడే. చవితి సందర్భంగా ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసే భక్తులకు పురోహితులు ఓ సూచన చేశారు. ఇంట్లో ప్రతిష్ఠించే గణపయ్య ప్రతిమ తొండం ఎడమ వైపు ఉండేలా చూసుకోవాలని చెప్పారు. దీనిని పూజిస్తే ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ నిండుతుందంట. కుడివైపు తొండం ఉన్న విగ్రహం వల్ల కష్టాలు తొలగిపోయి మంచి జరుగుతుందని చెబుతున్నారు. దీన్ని ‘సిద్ధి వినాయకుడు’ అంటారు.

Similar News

News November 27, 2025

భూపాలపల్లి: పంచాయతీ ఎన్నికలు.. మొదటి రోజు నామినేషన్లు ఎన్నంటే?

image

మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా భూపాలపల్లి జిల్లాలోని 4 మండలాలు గణపురం, కొత్తపల్లిగోరి, రేగొండ, మొగుళ్లపల్లిలో 82 గ్రామ పంచాయతీలకు 45 నామినేషన్లు దాఖలయ్యాయి. 712 వార్డులకు 35 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలిపారు. ఏదైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే 24 గంటలు పని చేసేలా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, 9030632608 నంబర్‌కు కాల్ చేయాలని ఆయన చెప్పారు.

News November 27, 2025

స్కిల్స్ లేని డిగ్రీలెందుకు: స్టూడెంట్స్

image

మారుతున్న ఉద్యోగ మార్కెట్‌కు అనుగుణంగా అకడమిక్ సిలబస్‌లో మార్పులు తీసుకురావాలని కొందరు విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాలేజీ దశలోనే నైపుణ్య ఆధారిత కోర్సులు, ఉద్యోగ కోచింగ్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. నైపుణ్యం లేని డిగ్రీలతో బయటకు వస్తే ఉద్యోగాలు దొరకడం లేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అందుకే ఉద్యోగం ఇప్పిస్తామని <<18402171>>మోసం<<>> చేసేవారు పెరుగుతున్నారన్నారు. మీ కామెంట్?

News November 27, 2025

7,948 MTS, హవల్దార్ పోస్టులు

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<>SSC<<>>) 7,948 MTS(నాన్ టెక్నికల్), హవల్దార్ ఖాళీల వివరాలను రీజియన్ల వారీగా ప్రకటించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్&కస్టమ్స్ (CBIC), సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్‌(CBN)లో ఈ పోస్టులు ఉన్నాయి. వీటిలో ఏపీలో 404, తెలంగాణలో169 పోస్టులు ఉన్నాయి. గతంలో 5,464 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. తాజాగా పోస్టులను జత చేసింది. త్వరలో పరీక్ష షెడ్యూల్‌ను ప్రకటించనుంది.