News January 20, 2025
నీరజ్ చోప్రా భార్య ఎవరో తెలుసా?

భారత స్టార్ జావెలిన్ త్రోయర్ <<15200143>>నీరజ్ చోప్రా పెళ్లి<<>> చేసుకున్న అమ్మాయి పేరు హిమాని మోర్. హరియాణాలోని సోనిపట్‌కు చెందిన 25 ఏళ్ల హిమాని జాతీయ స్థాయి టెన్నిస్ ప్లేయర్. ఢిల్లీలోని మిరండా హౌజ్ కాలేజీలో రాజనీతిశాస్త్రం, వ్యాయామ విద్యలో డిగ్రీ చేశారు. ప్రస్తుతం అమెరికాలోని ఓ యూనివర్సిటీలో క్రీడలకు సంబంధించిన కోర్సు చేస్తున్నారు.
Similar News
News October 31, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు!

బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,200 పెరిగి రూ.1,22,680కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రా.ల బంగారం ధర రూ.1,100 ఎగబాకి రూ.1,12,450గా ఉంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ. 1,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇదే ధరలున్నాయి.
News October 31, 2025
DRDOలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

DRDO అనుబంధ సంస్థ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో 5 రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో, జూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. MS, MSc, ME, M.TECH, పీహెచ్డీ, బీఈ, బీటెక్, నెట్, గేట్ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.drdo.gov.in/
News October 31, 2025
ముక్కలైన దేశాన్ని ఒక్కటి చేసిన ‘సర్దార్’

1947లో స్వాతంత్ర్యం నాటికి దేశంలో 565 సంస్థానాలున్నాయి. అప్పుడు రంగంలోకి దిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ HYD, కశ్మీర్, జునాగఢ్ మినహా అన్నీ దేశంలో కలిసిపోయేలా చేశారు. ఆ తర్వాత వాటిపైనా దృష్టి పెట్టారు. కశ్మీర్, జునాగఢ్ సంస్థానాధీశులతో పాటు అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన HYD నిజాం మెడలు వంచారు. ఆపరేషన్ పోలో చేపట్టి హైదరాబాద్ ప్రజలకు విముక్తి కల్పించారు. దేశాన్ని ఒక్కటిగా చేశారు. నేడు ‘సర్దార్’ జయంతి.


