News September 10, 2024
ODI హిస్టరీలో తొలి ‘డబుల్ సెంచరీ’ ఎవరిదో తెలుసా?

ODI క్రికెట్లో ‘డబుల్ సెంచరీ’ అనగానే సచిన్, రోహిత్ గుర్తుకొస్తారు. సచిన్ 2010లో తొలిసారి 200* రన్స్ బాదారు. కానీ అంతకు 13ఏళ్ల ముందే ఆసీస్ మహిళా క్రికెటర్ బిలిందా క్లార్క్ 229* పరుగులు చేశారు. ODI క్రికెట్ హిస్టరీలో ఇదే తొలి డబుల్ సెంచరీ. ముంబై వేదికగా జరిగిన 1997 WCలో డెన్మార్క్పై ఈ ఫీట్ నమోదుచేశారు. ఆమె 54వ పుట్టినరోజు నేడు. ఈ ప్లేయర్ 118 వన్డేల్లో 4,844 రన్స్, 15 టెస్టుల్లో 919 రన్స్ చేశారు.
Similar News
News November 23, 2025
టెక్ దిగ్గజాలందర్నీ ఒక చోటకు చేర్చిన AI

టెక్ బిలియనీర్ల ఫొటోలతో క్రియేట్ చేసిన ‘వన్ ట్రిలియన్ స్క్వాడ్’ AI పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్బర్గ్, టిమ్ కుక్, సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, శామ్ ఆల్ట్మన్, జెన్సెన్ హువాంగ్ను ఏఐ సహాయంతో పార్టీలో ఉన్నట్టుగా క్రియేట్ చేశారు. సమాంతర విశ్వంలో ఒక చోట, సరదాగా కలుసుకున్న, వన్ ట్రిలియన్ స్క్వాడ్ సమావేశం అంటూ ఫొటోలకు క్యాప్షన్స్ ఇచ్చారు.
News November 23, 2025
సత్యసాయి ఎప్పటికీ జీవించే ఉంటారు: విజయ్ దేవరకొండ

సత్యసాయి బాబాకు హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘విజయ్ సాయి’ అని నా పేరును మీరే పెట్టారు. సురక్షితమైన వాతావరణం, విద్యతో పాటు అనేక జ్ఞాపకాలను మాకు ఇచ్చారు. మంచి, చెడులోనూ మీ గురించే ఆలోచిస్తాం. మీరెప్పటికీ జీవించే ఉంటారు’ అని Xలో పేర్కొన్నారు. పుట్టపర్తిలోనే చదువుకున్న విజయ్ బాబాతో దిగిన చిన్ననాటి ఫొటోను షేర్ చేశారు.
News November 23, 2025
రోజూ నవ్వితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ప్రస్తుత బిజీ ప్రపంచంలో ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్తో సతమతమవుతున్న వారికి నవ్వు ఉత్తమ ఔషధమని నిపుణులు చెబుతున్నారు. రోజూ కనీసం 15 నిమిషాలు మనస్ఫూర్తిగా నవ్వితే శరీరానికి, మనసుకు అపారమైన లాభాలు కలుగుతాయి. నవ్వు ఒత్తిడిని తగ్గించి టైప్-2 డయాబెటిస్ను, బీపీని నియంత్రణలో ఉంచుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. నవ్వు సహజ పెయిన్కిల్లర్లా పనిచేస్తుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు.


