News September 21, 2024
ANR విలన్గా ఎందుకు చేయలేదో తెలుసా!

తన లోపాలను తెలుసుకోవడమే తన విజయానికి కారణమని అక్కినేని నాగేశ్వరరావు చెబుతుండేవారు. ఎన్టీఆర్ ఎన్నో పౌరాణిక, విలన్ పాత్రలు వేశారు. కానీ అక్కినేని ఒక్కసారీ విలనీ వైపు వెళ్లలేదు. పౌరాణికాల్ని పెద్దగా టచ్ చేయలేదు. తన రూపం, కంఠం అందుకు సరైనవి కావని ఆయన భావించడమే దానిక్కారణం. కానీ సాంఘిక సినిమాల్లో మాత్రం విశ్వరూపం చూపించారు. నేడు ఆ మహానటుడి శతజయంతి. సినిమా ఉన్నంతకాలం ఆయన మన మధ్య జీవించే ఉంటారు.
Similar News
News November 28, 2025
NTR: ఆ MLA తీరు అంతేనా.? షాక్కి గురైన నేతలు, అధికారులు.!

మంత్రి సత్యకుమార్ ఆధ్వర్యంలో విజయవాడలో నిన్న జరిగిన వైద్య సేవల సమీక్షలో MLA తీరు చర్చనీయాంశమైంది. పాత ప్రభుత్వాసుపత్రిలో చివరి దశకు చేరుకున్న క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణంలో రూ.3కోట్ల అవినీతి జరిగిందంటూ విజయవాడకు చెందిన ఓ MLA ఆరోపించారు. నిర్మాణం నిలిపివేసి విచారణ జరపాలని పట్టుబట్టడంతో, తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రోగుల పరిస్థితిని పట్టించుకోకుండా MLA మాట్లాడటంపై సమావేశంలో అసహనం వ్యక్తమైంది.
News November 28, 2025
నాన్-ఏసీ కోచ్ల్లోనూ దుప్పటి, దిండు

రైలు ప్రయాణికులకు సదరన్ రైల్వే శుభవార్త చెప్పింది. 2026 జనవరి 1 నుంచి నాన్-ఏసీ స్లీపర్లో కూడా దుప్పటి, దిండు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. ఇందుకోసం ప్రయాణికులు నిర్ణీత ఛార్జీలు చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు రూ.50, రూ.30, రూ.20లలో మూడు ప్యాకేజీలు తీసుకొచ్చింది. ఈ సౌకర్యాన్ని చెన్నై డివిజన్ ఎంపిక చేసిన 10 రైళ్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తోంది.
News November 28, 2025
హైదరాబాదీ బిర్యానీ.. వరల్డ్లో బెస్ట్!

భారతీయులు ఇష్టపడే వంటకాల్లో ఒకటైన హైదరాబాదీ బిర్యానీ ప్రపంచ గుర్తింపు పొందింది. ప్రఖ్యాత ఫుడ్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ విడుదల చేసిన ‘వరల్డ్ బెస్ట్ రైస్ డిషెస్’ లిస్టులో HYD బిర్యానీ 10వ స్థానంలో నిలిచింది. టాప్-50లో ఇండియా నుంచి ఉన్న ఏకైక వంటకం ఇదే కావడం విశేషం. కాగా తొలి మూడు స్థానాల్లో జపాన్ వంటకాలైన ‘నెగిటోరో డాన్’, ‘సుశి’, ‘కైసెండన్’ ఉన్నాయి. ప్రపంచమే మెచ్చిన HYD బిర్యానీ మీకూ ఇష్టమా?COMMENT


