News November 1, 2024

ధోనీకి రూ.4కోట్లే ఎందుకో తెలుసా?

image

నిన్నటి IPL రిటెన్షన్స్‌లో MS ధోనీని కేవలం రూ.4కోట్లకే చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకుంది. అయితే గతేడాది రూ.12కోట్లు తీసుకున్న Mr.కూల్‌ను ఈసారి కేవలం రూ.4కోట్లకే తీసుకోవడానికి కారణం అన్‌క్యాప్డ్ ప్లేయర్ రూల్. దీని ప్రకారం గత 5ఏళ్లలో ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడని క్రికెటర్‌ను అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా పరిగణిస్తారు. వారిని రూ.4కోట్లకే రిటైన్ చేసుకునే వెసులుబాటు ఉండటంతో దాన్ని CSK వినియోగించుకుంది.

Similar News

News November 1, 2024

భారీగా డ్రగ్స్ పట్టివేత

image

TG: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను DRI అధికారులు తనిఖీ చేయగా 7కేజీల హైడ్రోఫోనిక్ వీడ్ లభ్యమైంది. NTPS చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీజ్ చేసిన ఈ నిషేధిత పదార్థం విలువ రూ.7కోట్లు ఉంటుందని సమాచారం.

News November 1, 2024

సూర్య-జ్యోతికల పిల్లలను చూశారా?

image

తమిళ స్టార్ హీరో సూర్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఆయన సినిమాల కోసం ఆత్రుతగా ఎదురుచూసేవారున్నారు. అయితే, తన భార్య నటి జ్యోతికతో తప్ప పిల్లలతో ఆయన మీడియా ముందు కనిపించరు. తాజాగా కుటుంబమంతా కలిసి దీపావళి పండుగ జరుపుకున్నారు. ఈ ఫొటో వైరలవుతోంది. దీంతో ఈ దంపతుల పిల్లలు ఇంత ఎదిగిపోయారా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News November 1, 2024

రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తా: కేటీఆర్

image

TG: పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని కేటీఆర్ తెలిపారు. నిన్న Xలో ప్రజలతో కేటీఆర్ సంభాషణలను BRS ట్వీట్ చేసింది. కాంగ్రెస్ పాలనలో జరిగిన పతనం నుంచి తెలంగాణ కోలుకోవడం అసాధ్యమని, ప్రజల పక్షాన కొట్లాడడమే తమ ప్రస్తుత బాధ్యత అని చెప్పారు. BRS నేతలపై అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.