News May 15, 2024
ధోనీకి యూఎస్ వెళ్లడం ఎందుకిష్టమో తెలుసా?

తనకు ఇష్టమైన ట్రావెల్ డెస్టినేషన్ US అని ధోనీ ఇటీవల ఓ ఈవెంట్‌లో తెలిపారు. న్యూజెర్సీలో ఫ్రెండ్‌తో కలిసి గోల్ఫ్ ఆడతానని చెప్పారు. అక్కడ గోల్ఫ్ ఆడటం, ఫుడ్ తినడం, రెస్ట్ తీసుకోవడం తప్ప వేరే ఏ పనీ ఉండదన్నారు. తన ఫ్రెండ్ ఇంటి నుంచి 2.5నిమిషాల్లో గోల్ఫ్ ఆడే ప్లేస్‌కి వెళ్లొచ్చని తెలిపారు. అక్కడ లోకల్ టోర్నమెంట్‌లో కూడా పాల్గొంటానని, అక్కడ ఉండే 15-20 రోజులు తనకు బెస్ట్‌గా అనిపిస్తుందని చెప్పుకొచ్చారు.
Similar News
News April 3, 2026
మెగా మేనల్లుడి కొత్త సినిమా.. పోస్టర్ అదుర్స్

సుప్రీమ్ హీరో సాయి దుర్గతేజ్ తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ‘సీక్రెట్స్ ఆఫ్ ది ఏజెస్.. పవర్ బియాండ్ ఇమాజినేషన్’ అంటూ తన 19వ సినిమా పోస్టర్‌ను విడుదల చేయగా ఆకట్టుకుంటోంది. కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ డైరెక్టర్లు సుజిత్, సందీప్ సంయుక్తంగా తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సాయి తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.
News April 3, 2026
నిహారిక ‘రాకాస’ రివ్యూ&రేటింగ్

కోటలోని బ్రహ్మరాక్షసుడి బలికి చిక్కిన హీరో బయటపడటానికి ఏం చేశాడనేదే ‘రాకాస’ స్టోరీ. ఎప్పటిలాగే సంగీత్ కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. ఫస్టాఫ్ స్లోగా సాగుతుంది. సెకండాఫ్‌లో కొన్ని ట్విస్టులు ఆకట్టుకుంటాయి. నిహారిక ప్రొడక్షన్ వ్యాల్యూస్, అనుదీప్ దేవ్ BGM ఫర్వాలేదు. లాజిక్‌లు మిస్సవ్వడం, రొటీన్ హారర్ కామెడీ ఫీల్ కలుగుతుంది. క్లైమాక్స్‌లో డైరెక్టర్ మానస శర్మ తడబడ్డారు.
రేటింగ్: 2.25/5
News April 3, 2026
మరో వివాదంలో IAS రోహిణి సింధూరి!

IPS రూపాపై <<10034506>>ఆరోపణలతో<<>> వార్తల్లో నిలిచిన IAS రోహిణి సింధూరి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై FIR నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. 2021లో మైసూర్ డిప్యూటీ కమిషనర్‌గా ఉండగా ₹13 కాటన్ బ్యాగులను ₹52కు కొనడంతో ₹7.65 కోట్ల నష్టం వచ్చిందనే ఆరోపణలున్నాయి. ఆమెపై కేసు పెట్టాలని రవిచంద్రే గౌడ అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఆయన HCని ఆశ్రయించారు.


