News August 24, 2025

వడ మధ్యలో రంధ్రం ఎందుకో తెలుసా?

image

మినప వడలు సాధారణంగా మందంగా ఉంటాయి. మధ్యలో రంధ్రం లేకుండా ఉడికిస్తే బయటి భాగం త్వరగా వేగి, లోపల పచ్చిగా ఉంటుంది. రంధ్రం పెట్టడం వల్ల దాని ఉపరితల వైశాల్యం పెరుగుతుంది. వేడి నూనె వడ లోపలి భాగాలను సమానంగా తాకి ఈజీగా డీప్ ఫ్రై అవుతుంది. అంతేకాదు రంధ్రం వల్ల వడ తక్కువ మోతాదులో నూనెను వాడుకుంటుంది. ఆకారం మారకుండా ఉంటుంది. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా రంధ్రం వెనుక ఇంత స్టోరీ ఉందన్నమాట.

Similar News

News August 24, 2025

ఆయుధాలు వాడకుండా ఉక్రెయిన్‌పై US ఆంక్షలు!

image

USమేడ్ లాంగ్-రేంజ్ ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్స్‌(ATACMS)ని ఉక్రెయిన్ వాడకుండా అమెరికా ఆపుతోందని WSJ పేర్కొంది. రష్యాపై ATACMS వాడేందుకు US అనుమతి కావాలని షరతు పెట్టినట్లు తెలిపింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపలేకపోయానని ట్రంప్ ఫ్రస్ట్రేషన్‌తో ఉన్న నేపథ్యంలో ఈ వార్తలు రావడం గమనార్హం. మరోవైపు రష్యాపై టారిఫ్స్ వేయడం లేదా శాంతి చర్చల నుంచి తప్పుకోవడంపై ఆలోచిస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.

News August 24, 2025

OG అప్డేట్.. సెకండ్ సింగిల్ ఎప్పుడంటే?

image

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక కాంబోలో సుజీత్ తెరకెక్కిస్తున్న OG మూవీపై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. వినాయక చవితి కానుకగా ఈనెల 27న 10.08AMకు సెకండ్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ‘సువ్వీ సువ్వీ’ అంటూ సాగే సాంగ్ మిమ్మల్ని గెలుస్తుంది అంటూ స్పెషల్ పోస్టర్‌ షేర్ చేశారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం SEP 25న విడుదల కానుంది.

News August 24, 2025

త్వరలోనే బాధ్యులపై చర్యలు: మంత్రి రాంప్రసాద్

image

AP: ‘ఆడుదాం ఆంధ్రా’పై విచారణ పూర్తయిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. బాధ్యులపై త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలోనే క్రమశిక్షణ కలిగిన పార్టీ టీడీపీ అని ఆయన వివరించారు. ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పార్టీలో అందరూ సమానమే అని పేర్కొన్నారు. తిరుపతిలో అమరావతి ఛాంపియన్‌షిప్ పోటీల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.