News August 28, 2024

పదేళ్లు తెలంగాణ తల్లి గుర్తుకురాలేదా?: రేవంత్

image

TG: మిలియన్ మార్చ్ తరహాలో డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేపడతామని CM రేవంత్ తెలిపారు. భూమి పూజ అనంతరం ఆయన మాట్లాడారు. ‘మంచి రోజులు లేవని పండితులు చెప్పడంతో ఇవాళ కార్యక్రమం నిర్వహించాం. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న BRSకు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదు? కన్నతల్లిని తల‌పించేలా, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా విగ్రహం ఉంటుంది’ అని సీఎం స్పష్టం చేశారు.

Similar News

News December 6, 2025

తెలుగు రాష్ట్రాలపై చలి పంజా

image

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరుగుతోంది. నిన్న APలోని అల్లూరి జిల్లా జి.మాడుగులలో అత్యల్పంగా 10 డిగ్రీలు, అరకులో 11, పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు TGలోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో 11-15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

News December 6, 2025

రిలేషన్‌షిప్‌లో ఈ తప్పులు చేస్తున్నారా?

image

దాంపత్య జీవితంలో చిన్న తప్పులు కూడా ఇద్దరి మధ్య దూరం పెంచేస్తాయని రిలేషన్‌షిప్ కౌన్సిలర్స్ హెచ్చరిస్తున్నారు. ‘మీ పార్ట్‌నర్ మాట్లాడేటప్పుడు పట్టనట్లు ఫోన్ చూసుకోకండి. చిన్న విషయాలకు కూడా కేకలు వేయకండి. ఏ చిన్న పనైనా మీ పార్ట్‌నర్‌తో డిస్కస్ చేయకుండా మొదలు పెట్టకండి. ఒకరి ఇష్టాన్ని ఒకరు గౌరవించుకోవాలి. ఏ రోజు డిఫరెన్సెస్‌ని ఆరోజే మాట్లాడుకుంటే లైఫ్ సాఫీగా సాగిపోతుంది’ అని సూచిస్తున్నారు.

News December 6, 2025

నేడు అమెరికాకు మంత్రి లోకేశ్

image

AP: పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ ఇవాళ్టి నుంచి 10వ తేదీ వరకు అమెరికా, కెనడా దేశాల్లో పర్యటించనున్నారు. తొలిరోజు డల్లాస్‌లోని తెలుగువారిని కలుస్తారు. 8, 9వ తేదీల్లో శాన్ ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీ ప్రతినిధులతో భేటీ అవుతారు. 10న టొరెంటోలో పర్యటిస్తారు. ఈ 18 నెలల్లో లోకేశ్ అమెరికా వెళ్లడం రెండోసారి కావడం విశేషం. ఇప్పటివరకు US, దావోస్, సింగపూర్ ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటించారు.