News April 15, 2025

తరచూ ఒళ్లు విరుస్తున్నారా?

image

ఏదైనా ఓ పని పూర్తయ్యాక అప్రయత్నంగానే ఒళ్లు విరిచి ఆవలిస్తుంటాం. ఇలా చేస్తే హాయిగా అనిపిస్తుంది. ఇలా ఒళ్లు విరవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కండర సంకోచాలు నియంత్రించే నాడులు తిరిగి గాడిలో పడతాయి. అనుసంధాన కణజాల పొరలు ఉత్తేజితమవుతాయి. శరీరం నిటారుగా ఉండేందుకు తోడ్పడుతుంది. రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేస్తుంది. డోపమైన్ కూడా విడుదలై సంతోషంగా అనిపిస్తుంది.

Similar News

News April 17, 2025

భారత్‌కు మరో స్వర్ణం

image

పెరూలో జరుగుతున్న ISSF వరల్డ్ కప్‌లో భారత్ ఖాతాలో మరో బంగారు పతకం చేరింది. మిక్స్‌డ్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో సౌరభ్ చౌదరీ, సురుచి సింగ్ జోడీ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు 10 మీటర్ ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో సురుచి స్వర్ణం, మను భాకర్ రజతం గెలుచుకున్నారు.

News April 17, 2025

ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్

image

హీరోయిన్ జనని నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. పైలట్ సాయి రోషన్ శ్యామ్‌తో ఎంగేజ్మెంట్ జరిగిందని పేర్కొన్నారు. సంబంధిత ఫొటోలను షేర్ చేశారు. ఈ బ్యూటీ బాలా తెరకెక్కించిన ‘వాడు-వీడు’ మూవీతో తెరంగేట్రం చేశారు. తెగిడి, హాట్ స్పాట్, భగీర, బెలూన్, కాజల్ కార్తీక వంటి చిత్రాల్లో నటించారు. జననికి పలువురు సినీ ప్రముఖులు విషెస్ తెలియజేస్తున్నారు.

News April 17, 2025

IPL: రాజస్థాన్ కెప్టెన్‌ రిటైర్డ్ హర్ట్

image

ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు. అతడు 19 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 31 రన్స్ చేసి మంచి ఊపు మీద కనిపించారు. అంతలోనే పక్కటెముల గాయం వేధించడంతో మైదానాన్ని వీడారు. తర్వాతి మ్యాచుకు సంజూ అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. సంజూ దూరమైతే మాత్రం రాజస్థాన్‌కు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు.

error: Content is protected !!