News February 18, 2025

బయట ఫుడ్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారా?

image

రెస్టారెంట్‌ ఫుడ్ తినడంలో చైనా, అమెరికా, సింగపూర్ దేశాలు ముందున్నాయి. ఈ విషయాన్ని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా దీనికి డా.సుధీర్ ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చారు. ‘ఇందులో మేము సింగపూర్ & ఇతర అభివృద్ధి చెందిన దేశాల కంటే వెనుకబడి ఉన్నా పర్లేదు. ఎందుకంటే ఇంట్లో వండిన ఆహారం అత్యంత ఆరోగ్యకరమైన ఎంపిక. బయట ఫుడ్ వల్ల ఊబకాయం, టైప్ 2 మధుమేహం, గుండెపోటు, స్ట్రోక్, క్యాన్సర్ వంటి సమస్యలు తలెత్తవచ్చు’ అని తెలిపారు.

Similar News

News January 7, 2026

కవిత రాజీనామాకు ఆమోదం

image

TG: కవిత రాజీనామాకు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదం తెలిపారు. 2025 సెప్టెంబర్‌లో బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంతో ఆమె ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేశారు. నిన్న మండలిలో తన రాజీనామాను ఆమోదించాలని ఛైర్మన్‌ను కోరారు. 2022లో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఆమె ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

News January 7, 2026

స్మిత్ సంచలనం.. తొలి ప్లేయర్‌గా రికార్డు

image

యాషెస్ సిరీస్ ఐదో టెస్టులో సెంచరీ బాదిన ఆస్ట్రేలియన్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచారు. అన్ని ఫార్మాట్లలో కలుపుకొని 5,085 రన్స్ చేశారు. తర్వాతి స్థానాల్లో బ్రాడ్‌మాన్(AUS-5,028), బోర్డర్(AUS-4,850) ఉన్నారు. మరోవైపు అత్యధిక శతకాల జాబితాలో సచిన్(51), కల్లిస్(45), పాంటింగ్(41), రూట్(41), సంగక్కర(38) తర్వాతి స్థానంలో స్మిత్(37) ఉన్నారు.

News January 7, 2026

అసెంబ్లీ నిరవధిక వాయిదా

image

తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ఈ సెషన్లో సభ 13 బిల్లులు, 2 తీర్మానాలను ఆమోదించింది. 5 రోజుల్లో 40 గంటల 45 నిమిషాల పాటు అసెంబ్లీ జరిగింది. ఈ సమావేశాల్లో కృష్ణా జలాలపై చర్చ జరగ్గా ప్రధాన ప్రతిపక్షం BRS దూరంగా ఉంది. మాజీ సీఎం కేసీఆర్ తొలిరోజు సంతకం చేసి వెళ్లిపోయారు. తిరిగి సభకు హాజరుకాలేదు.