News March 17, 2024

నీలిచిత్రాలు ఎక్కువగా చూస్తున్నారా…?

image

పరిమితంగా ఉంటే అలవాటు. పరిధి దాటితే వ్యసనం. అలవాట్లు ప్రమాదకరం కాకపోవచ్చు కానీ.. వ్యసనంగా మారే ఏదైనా ప్రమాదమే. నీలిచిత్రాల విషయంలోనూ ఇది వర్తిస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఒకస్థాయి తర్వాత మెదడు ఉద్వేగరహిత స్థాయికి చేరి మొద్దుబారిపోతుందంటున్నారు. ‘పోర్న్ వ్యసనంతో శృంగారాన్ని ఆస్వాదించే సామర్థ్యాన్ని మెదడు కోల్పోతుంది. దాంపత్యంపై అది తీవ్ర ప్రభావం చూపిస్తుంది’ అని నిపుణులు వారిస్తున్నారు.

Similar News

News September 9, 2025

పంజాబ్‌ వరదలు.. భజ్జీ మంచి మనసు

image

భారీ వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరైన పంజాబ్‌కు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ తన వంతు సాయం చేశారు. వరద బాధితులకు అండగా నిలిచేందుకు 11 స్టీమర్ బోట్లు, 3 అంబులెన్సులు, రూ.50 లక్షలను సేకరించి విరాళంగా అందించారు. కాగా భారీ వర్షాలకు పలు ఘటనల్లో పంజాబ్‌లో 48 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు వరదలతో పంట నష్టపోయిన చోట ఎకరాకు రికార్డు స్థాయిలో రూ.20 వేల పరిహారం ప్రభుత్వం ప్రకటించింది.

News September 9, 2025

ఆ కంపెనీలపై ట్రంప్ పన్ను పోటు!

image

అమెరికాలో విదేశీ వర్కర్లను నియమించుకునే కంపెనీలపై 25 శాతం అదనంగా పన్నులు విధించాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పన్నులు ఈ ఏడాది డిసెంబర్ 31 తర్వాత అమలు చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికన్లకే ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో ఈ విధానం తీసుకొస్తున్నట్లు సమాచారం.

News September 9, 2025

డొనాల్డ్ ట్రంప్ మనవరాలిని చూశారా?

image

యూఎస్ ఓపెన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీ సందడి చేసింది. ఈ ఈవెంట్‌కు ట్రంప్‌తో పాటు ఇవాంకా భర్త జారెడ్ కుష్నర్, వారి కుమార్తె అరబెల్లా రోజ్ కుష్నర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ మీడియా కళ్లన్నీ 13 ఏళ్ల అరబెల్లానే ఫోకస్ చేయడంతో ఆమె హైలైట్ అయ్యారు. తన తాత ట్రంప్‌తో ముచ్చటిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.