News March 10, 2025
రోజూ తలస్నానం చేస్తున్నారా?

వెంట్రుకలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు తలస్నానం తప్పనిసరి. తలలో జిడ్డు చర్మం ఉన్నవారు వారానికి నాలుగు సార్లు హెడ్ బాత్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పొడి చర్మం ఉన్నవారు వారానికి 2 సార్లు చేయాలని చెబుతున్నారు. దుమ్ము, ధూళి, కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసిస్తే రోజూ హెడ్ బాత్ చేయాలని సూచిస్తున్నారు. ఇక వేసవిలో శిరోజాల సమస్యలు రాకుండా ఉండేందుకు వారానికి 4సార్లు చేయడం ఉత్తమమని చెబుతున్నారు.
Similar News
News March 10, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. వ్యూస్‌లో రికార్డు

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ (INDvsNZ) జియో హాట్‌స్టార్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన మ్యాచుగా రికార్డు నెలకొల్పింది. మ్యాచ్ ముగిసే సమయానికి హాట్‌స్టార్‌లో వ్యూస్ సంఖ్య 90.1కోట్లకు చేరింది. పోటాపోటీగా సాగిన మ్యాచును వీక్షించేందుకు క్రీడాభిమానులు అమితాసక్తి కనబరిచారు. దీంతో INDvsAUS సెమీ ఫైనల్ మ్యాచ్ వ్యూస్‌ను (66 కోట్లు) ఫైనల్ అధిగమించింది. గత నెల 23న జరిగిన INDvsPAK మ్యాచుకు 60.2కోట్ల వ్యూస్ వచ్చాయి.
News March 10, 2025
పదవి రాకున్నా CBNను దేవుడిగానే కొలుస్తా: బుద్ధా వెంకన్న

AP: తనకు MLC టికెట్ రాకపోవడంపై మాజీ MLC బుద్ధా వెంకన్న స్పందించారు. CM చంద్రబాబు తనకు దేవుడితో సమానమన్నారు. రాజకీయ క్రీడలో ఒక్కోసారి పదవులు రావని చెప్పారు. కొన్నిసార్లు దేవుడు పరీక్ష పెడతాడని, పదవి రాకున్నా CBNను దేవుడిగానే కొలుస్తానన్నారు. పదవి ఇస్తే ఒకలాగా, లేకపోతే మరోలా ఉండటం తనకు చేతకాదన్నారు. వచ్చినప్పుడు ఎలా సంతోషంగా ఉంటామో, రానప్పుడూ అంతే హుందాగా ఉంటానని చెప్పారు.
News March 10, 2025
ALERT: మూడు రోజులు జాగ్రత్త

తెలంగాణలో రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచించింది. ఎండ వేడిమి నుంచి రక్షించుకునేందుకు అధికంగా నీరు తాగండి, చెప్పులు ధరించండి, సీజనల్ ఫ్రూట్స్ తినండి. నీరు తాగినప్పటికీ దాహంగా ఉంటే ORS తాగడం బెటర్. టీ- కాఫీలాంటి వాటికి దూరంగా ఉండండి. అధిక ప్రొటీన్ ఆహారం కూడా వద్దు.