News November 8, 2024
పగటిపూట నిద్ర కమ్మేస్తోందా?

రోజువారీ పనులను చేస్తున్నప్పుడు నిద్రమత్తు కమ్మేసినట్లు అనిపిస్తుందా? డిమెన్షియా అనే న్యూరోడెజెనరేటివ్ వ్యాధితో బాధపడుతున్నారని అర్థం. మెదడులోని కణాలు క్షీణించడం, కాలక్రమేణా క్రమంగా దెబ్బతినడమే డిమెన్షియా. ఇది ఒక వ్యక్తి జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తుంది. గందరగోళాన్ని కలిగించి వారి వ్యక్తిత్వాన్ని మార్చుతుంది. వృద్ధులు ఎక్కువగా దీనికి గురవుతారు. అల్జీమర్స్ వ్యాధి డిమెన్షియాలోని సాధారణ రకం.
Similar News
News January 19, 2026
రికార్డు స్థాయిలో పడిపోయిన చైనా జనాభా

చైనాలో వరుసగా నాలుగో ఏడాదీ జనాభా క్షీణించింది. 2025లో 33.9 లక్షలు తగ్గి 140.5 కోట్లకు చేరింది. జననాల రేటు 5.63గా నమోదై రికార్డుస్థాయికి పడిపోయింది. మరణాల రేటు మాత్రం 8.04తో 1968 తర్వాత గరిష్ఠ స్థాయికి చేరింది. యువత పెళ్లిళ్లపై విముఖత చూపడం, పెరిగిన జీవనవ్యయం వల్ల దంపతులు పిల్లలు వద్దనుకోవడం ఇందుకు కారణాలు. ప్రభుత్వం ఎన్ని ప్రోత్సాహకాలు ప్రకటించినా, ‘ముగ్గురు పిల్లల’ విధానం తెచ్చినా మార్పు రాలేదు.
News January 19, 2026
హైదరాబాద్లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు… అప్లై చేశారా?

హైదరాబాద్లోని <
News January 19, 2026
గొర్రె, మేక పిల్లల పెరుగుదలకు సూచనలు

గొర్రె, మేక పిల్లలు పుట్టాక వారం వరకు రైతులు జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లి నుంచి సరిపడా పాలు అందుతున్నాయా? లేదా? గమనించాలి. ఇది వాటి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెటర్నరీ డాక్టరు సూచన మేరకు దాణా అందించాలి. రెండు నుంచి ఐదు నెలల వరకు జొన్నలను దాణాగా ఇవ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన మొక్కజొన్నలను పెట్టాలి. విటమిన్స్, కాల్షియం దాణాలో తగినంత ఉండేలా చూడాలి. పిల్లలకు 3 నెలల వయసులో డీవార్మింగ్ ప్రారంభించాలి.


