News May 22, 2024
ఫోన్ పక్కనే పెట్టుకుని నిద్రిస్తున్నారా?

మొబైల్ రిలీజ్ చేసే ఫ్రీక్వెన్సీ రేడియేషన్ క్యాన్సర్‌కు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లలకు మెదడు వ్యాధులు రావొచ్చు. పక్కనే పెట్టుకున్నప్పుడు పేలితే పెద్ద ప్రమాదం సంభవించవచ్చు. ఫోన్ ద్వారా వచ్చే నీలికాంతితో నిద్రలేమి సమస్యలు వస్తాయట. వీలైనంతగా ఫోన్‌ను దూరంగా ఉంచాలి. అలారం కోసం ప్రత్యేక వాచ్ కొనుగోలు చేస్తే మేలని సూచిస్తున్నారు.
Similar News
News February 12, 2026
నేనే రాజు.. నేనే మంత్రి: రేవంత్ రెడ్డి

ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో TG సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘తెలంగాణకు నేనే రాజు, నేనే మంత్రి. నాకు ఎవరూ పోటీ కాదు. పదిన్నరేళ్లు సీఎంగా ఉంటాను’ అని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ లాంటి పాపపు పనులు తాను చేయనని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు అందరూ ఒకటేనని, టీఆర్ఎస్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందని వ్యాఖ్యానించారు.
News February 12, 2026
‘ఖేలో ఇండియా’ నుంచి 1,342 మంది అథ్లెట్ల తొలగింపు

ఖేలో ఇండియా ప్రోగ్రామ్ నుంచి గత 3ఏళ్లలో 1,342 మంది అథ్లెట్లను తొలగించినట్లు కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ రాజ్యసభలో వెల్లడించారు. లో పర్ఫార్మెన్స్, డోపింగ్ ఉల్లంఘనలే ఇందుకు కారణమని చెప్పారు. 3ఏళ్లలో 2,905 మంది కొత్తగా చేరారని తెలిపారు. స్పోర్టింగ్ టాలెంట్‌ను గుర్తించి ట్రైనింగ్ ఇచ్చేందుకు కేంద్రం 2017లో ఈ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. దీని కింద ప్రస్తుతం 23K+ మంది అథ్లెట్లు శిక్షణ పొందుతున్నారు.
News February 12, 2026
ఇంటర్ సెకండియర్లో NCERT ఆధారిత సిలబస్

AP: ఇంటర్ సెకండియర్లో 2026-27 నుంచి NCERT ఆధారిత సిలబస్‌ను అమలు చేస్తామని బోర్డు ప్రకటించింది. ‘సైన్సులో మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ (బోటనీ, జువాలజీ కలిపి) ఉంటాయి. ఆర్ట్స్‌లో సివిక్స్, ఎకనమిక్స్, కామర్స్, హిస్టరీలుంటాయి. భాషల్లో ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ, సంస్కృతం, హిందీ ఉంటాయి’ అని బోర్డు తెలిపింది. ఫస్టియర్లోని సవరించని 5 సబ్జెక్టులను 2026-27 నుంచి సవరించి అమలు చేస్తామని పేర్కొంది.


